BRS: 1న డల్లాస్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవాలు
ABN, Publish Date - May 06 , 2025 | 05:19 AM
అమెరికాలోని డల్లాస్ నగరంలోనూ బీఆర్‌ఎస్ రజతోత్సవాలను నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు రజతోత్సవాలను జరపాలని నిర్ణయించిన విషయం విదితమే.
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని డల్లాస్ నగరంలోనూ బీఆర్‌ఎస్ రజతోత్సవాలను నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు రజతోత్సవాలను జరపాలని నిర్ణయించిన విషయం విదితమే..! అందులో భాగంగానే డల్లాస్ నగరంలో రజతోత్సవాలను చేపట్టాలని నిర్ణయించినట్లు బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహే్‌షబిగాల, యూఎ్‌సఏ పార్టీ అడ్వైజరీబోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డల్లాస్‌లోని పెప్పర్‌అరేనాలో జూన్ 1న చేపట్టే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. అమెరికాతో పాటు.. వివిధ దేశాల్లోనూ ఏడాదిపాటు పార్టీ రజతోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు.
Updated Date - May 06 , 2025 | 05:19 AM