ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maganti Gopinath: మాగంటికి వెంటిలేటర్‌పై చికిత్స

ABN, Publish Date - Jun 07 , 2025 | 03:24 AM

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. వైద్యానికి ఆయన శరీరం స్పందిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు.

  • ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌ బాబు

బంజారాహిల్స్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. వైద్యానికి ఆయన శరీరం స్పందిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు. గురువారంఛాతీలో నొప్పి రావడంతో మాగంటి ఇంట్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సీపీఆర్‌ చేయడంతో కాస్త కోలుకున్నారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే సమయంలో స్పృహ కోల్పోయారు. ఆసుపత్రి వర్గాలు మరోసారి సీపీఆర్‌ చేయడంతో పల్స్‌ రేటు పెరిగింది. దీంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు.


వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు చెబుతున్న వివరాల ప్రకారం.. గోపినాథ్‌ ఆరోగ్యం గురువారం కన్నా శుక్రవారం మెరుగ్గా ఉందన్నారు. కాగా, కేటీఆర్‌ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన సతీమణి శైలిమ గురువారమే ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం కూడా ఆమె ఆసుపత్రికి వెళ్లి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేటీఆర్‌ కుమారుడు, మాగంటి కుమారుడు హైదరాబాద్‌లో కలిసి చదువుకోవడం వల్ల రెండు కుటుంబాల మధ్య మైత్రి ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు

బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 03:24 AM