ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dasoju Sravan: ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ ప్రమాణం

ABN, Publish Date - Apr 17 , 2025 | 03:50 AM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఇటీవలఎన్నికైన బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ప్రాంగణంలో బుధవారం మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

  • ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఇటీవలఎన్నికైన బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ప్రాంగణంలో బుధవారం మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండప్రకాశ్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, పద్మారావు గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.


అంతకు ముందు దాసోజు శ్రవణ్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి శాసన మండలికి చేరుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ కార్యకర్తగా పద్దెనిమిదేళ్లు ఉన్నానని, మాజీ సీఎం కేసీఆర్‌ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం రాజకీయ పునర్జన్మగా భావిస్తున్నానని చెప్పారు.

Updated Date - Apr 17 , 2025 | 03:50 AM