ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ramchander Rao: విశ్వాసం కోల్పోయిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

ABN, Publish Date - Jul 10 , 2025 | 04:21 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల విశ్వాశాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని తెలిపారు.

  • రైతు భరోసా అందించడంలో రేవంత్‌ విఫలం

  • భద్రాచలం ఈవోపై దాడిని ఖండిస్తున్నాం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు చెందిన 200 మంది బీజేపీలో చేరిక

గజ్వేల్‌/హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల విశ్వాశాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అందుకే అధికార పార్టీనీ విడిచి, యువత, మహిళలు, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, ఆయన అనుచరులతోపాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు చెందిన 200 మంది కార్యకర్తలు బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని, సీఎం ఢిల్లీ టూర్లు తిరగడం.. బీజేపీని తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పెన్షన్లు, రైతు భరోసా పంపిణీలో రేవంత్‌ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. భద్రాచలంలో దేవస్థాన భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి వెళ్లిన ఈవోపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇతర మతస్తులు ఈవోపై దాడి చేసి, ఇతర ప్రార్థనా మందిరాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా దేవాలయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను భాధ్యతలు చేపట్టిన అనంతరం గజ్వేల్‌ నుంచి చేరికలు జరగడం సంతోషంగా ఉందన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ కంచుకోటలో ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కాగా, దివ్యాంగుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. పింఛన్‌ను రూ.6వేలకు పెంచుతామని, 80శాతం వైకల్యం ఉన్న వారికి 15వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి.. అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో దివ్యాంగుల జీవితాల్లో ఆర్థిక భద్రత కరువైందని పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు సైతం పింఛన్ల మంజూరులో జాప్యం చేస్తున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 04:21 AM