ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రక్షాళన?

ABN, Publish Date - Aug 04 , 2025 | 04:20 AM

బీజేపీ రాష్ట్ర కమిటీలో భారీ ప్రక్షాళన జరగనుందా? ఇప్పటిదాకా కమిటీలో కొనసాగిన వారిలో చాలామందికి కొత్త కమిటీలో అవకాశం కష్టమేనా? నామ్‌కే వాస్తేగా కమిటీలో ఉన్న నాయకులకు షాక్‌ తప్పదా? అంటే బీజేపీ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తుంది.

  • కొత్త వారికి పదవులు దక్కే అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కమిటీలో భారీ ప్రక్షాళన జరగనుందా? ఇప్పటిదాకా కమిటీలో కొనసాగిన వారిలో చాలామందికి కొత్త కమిటీలో అవకాశం కష్టమేనా? నామ్‌కే వాస్తేగా కమిటీలో ఉన్న నాయకులకు షాక్‌ తప్పదా? అంటే బీజేపీ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తుంది. నూతన కమిటీలోని దాదాపు 70 శాతం పదవులను కొత్త వాళ్లకే కేటాయించబోతున్నారని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కమిటీల్లో క్రియాశీలకంగా పని చేసిన వారిని మాత్రమే కొనసాగించాలని అధినాయకత్వం అనుకుంటున్నట్టు తెలిసింది. గత ఐదేళ్లలో కొందరు కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు కనీసం పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడలేదనే ఆరోపణలున్నాయి. అలాంటి వారికి ఈసారి పదవులు లభించే అవకాశం లేదని అంటున్నారు.

గత కమిటీలో 16 మంది అధికార ప్రతినిధులు ఉండగా, వీరిలో పలువురు కేవలం హోదా కోసమే కొనసాగినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధుల సంఖ్య తగ్గింపు అంశంపై ముఖ్యనేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, గత కమిటీలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు కొత్త కమిటీలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ అధికంగా ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. పార్టీ నియమావళి ప్రకారం, సంస్థాగత ప్రధాన కార్యదర్శితో పాటు నలుగురు ప్రధాన కార్యదర్శులు ఉంటారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 6న పెద్దపల్లి, మంచిర్యాల, సిర్‌పూర్‌-కొమ్రంభీం, 7న భువనగిరి, జనగాం జిల్లాల్లో పర్యటిస్తారు.

Updated Date - Aug 04 , 2025 | 04:20 AM