Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
ABN, Publish Date - Jul 10 , 2025 | 03:27 AM
రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి కల్పన, సంపదసృష్టి తదితర అంశాల్లో పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామికవేత్తల సలహాలు తీసుకుంటాం: భట్టి
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి కల్పన, సంపదసృష్టి తదితర అంశాల్లో పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, చక్కటి వాతావరణం, 24గంటల విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాల వల్ల ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అని పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సీఎ్‌ఫవో(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)ల సదస్సులో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వల్ల ఫార్మా, ఐటీ కంపెనీలతోపాటు హౌసింగ్, వ్యవసాయం, చేనేత సహా పలు పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటవుతాయని తెలిపారు.
లండన్‌లోని థేమ్స్ నది మాదిరిగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని, త్వరలో ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం కుటుంబసభ్యులుగా పరిగణిస్తుందని, రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎ్‌సఆర్) కింద ఖర్చు చేసే నిధులను రైతులు, మహిళల ప్రగతి కోసం కూడా వెచ్చించాలని సూచించారు. రాష్ట్రంలో సమ్మిళితాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం భాగస్వామిగా ఉండాలని, ప్రజల విజయంలో పారిశ్రామికవేత్తలూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో సీఐఐ నిర్వాహకులు శేఖర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నరసింహం, గౌతమ్‌రెడ్డి, షమీయుద్దీన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 03:27 AM