ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: నిధుల సమీకరణపై దృష్టి సారించాలి: భట్టి

ABN, Publish Date - Jun 06 , 2025 | 03:06 AM

నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. నిధుల సమీకరణపై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైంది. సమావేశంలో సబ్‌ కమిటీ సభ్యుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ సబ్‌ కమిటీ సమావేశం ప్రతివారం జరుగుతుందని, తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.


ఈ నిర్ణయాల ప్రగతిని వచ్చేవారం సమావేశంలో అంశాల వారీగా సమీక్షిస్తామని తెలిపారు. నిధుల సమీకరణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శాఖలవారీగా రాబడుల వివరాలను సమీక్షించారు.

Updated Date - Jun 06 , 2025 | 03:06 AM