ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BellamKonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌‌కు నోటీసులు

ABN, Publish Date - May 15 , 2025 | 07:04 PM

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కారును జూబ్లీహిల్స్‌ పోలీసులు సీజ్ చేశారు. రెండ్రోజుల కిందట ట్రాఫిక్ పోలీసులతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ దురుసుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే..

Bellamkonda Srinivas

Bellamkonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహరించినట్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కారును పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.


అసలేం జరిగిందంటే..

ఈనెల 13న రోడ్‌ నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్ కాలనీలోని చౌరస్తా వద్ద హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్‌రూట్‌లో తన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అదే సమయంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ బెల్లంకొండ శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నారు. రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దంటూ ఆయనకు సూచించారు. అయితే, కానిస్టేబుల్ చెబుతున్నప్పటికీ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ఏమాత్రం వినకుండా రాంగ్‌ రూట్‌లోనే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు బెల్లంకొండ శ్రీనివాస్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. కారును ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రయత్నించగా.. ఆయన మీదుగానే కారును పోనిచ్చేందుకు హీరో యత్నించారు. ఇదే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 15 , 2025 | 07:57 PM