ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూప్‌-1పై తప్పుడు ఆరోపణలు.. క్షమించండి

ABN, Publish Date - May 13 , 2025 | 05:10 AM

గ్రూప్‌-1 పరీక్షలపై తాను చేసిన ఆరోపణలపై క్షమాపణలు కోరుతున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌ తెలిపారు.

  • బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌ లేఖ

గ్రూప్‌-1 పరీక్షలపై తాను చేసిన ఆరోపణలపై క్షమాపణలు కోరుతున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌ తెలిపారు. ఫలితాల ప్రకటన అనంతరం ఆయన మార్చి 11న నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రూప్‌-1 పరీక్షల తీరుపై ఆరోపణలు చేశారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, రీవాల్యుయేషన్‌ చేయుంచాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఆధారాలు చూపాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆయనకు నోటీసులు పంపింది.


దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. అవకతవకలు జరిగాయంటూ కొందరు ఫెయిలైన అభ్యర్థులు పేర్కొన్న మాటలను నిజ నిర్ధారణ చేసుకోకుండా తాను పేర్కొన్నానని తెలిపారు. తన తప్పును ఒప్పుకోవడంతో నరేందర్‌ గౌడ్‌పై పరువునష్టం దావా, క్రిమినల్‌ కేసుల ప్రతిపాదనను పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెనక్కి తీసుకుంది.

Updated Date - May 13 , 2025 | 05:10 AM