ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

ABN, Publish Date - Mar 14 , 2025 | 05:56 AM

రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టించుకోరా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు.

  • ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఎందుకు విడుదల చేయటం లేదు?

  • అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించాలి

  • దిద్దుబాటు చర్యలు చేపట్టాలి: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టించుకోరా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ మార్క్‌ రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా అని నిలదీశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల మేరకు పంట ఎండిపోయినట్లు తెలుస్తోందని, ముఖ్యంగా ఆయకట్టు చివరి పంటలకు నీళ్లందక పూర్తిగా ఎండిపోతున్నాయన్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునేందుకు, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. ఫలితంగా వానాకాలంలో రికార్డుస్థాయిలో 160 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వచ్చింది. యాసంగిలోనూ 56 లక్షల ఎకరాల్లో వరి, మరో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలనే దానిపై ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ అమలు చేయలేదు. నెల రోజుల్లో పంటలు కోతకు వస్తున్న తరుణంలో పొలాలకు నీరందక ఎండుతున్నాయి. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే’ అని పేర్కొన్నారు.


రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 340 టీఎంసీలకుపైగా నీటి నిల్వలున్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని, వాటిలో 150 టీఎంసీలు డెడ్‌స్టోరేజీ పోగా, మరో 190 టీఎంసీలకుపైగా నీరు అందుబాటులో ఉందన్నారు. తాగునీటి అవసరాలకు మినహాయిం చి మిగిలిన నీటిని సకాలంలో విడుదల చేసి చెరువులు నింపినట్లయితే పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తేది కాదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవసాయశాఖ ప్రణాళికలేమి కారణంగా.. నీళ్లున్నా వాడుకోలేని దుస్థితి తలెత్తి 10లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రైతుల ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన కాంగ్రెస్‌ప్రభుత్వానికి లేకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఈ అం శాన్నీ కేంద్రంపైకి నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా?అని సీఎంను ప్రశ్నించారు. బాఽధిత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలని, ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 14 , 2025 | 05:56 AM