ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Auto Drivers: ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - May 30 , 2025 | 04:06 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భారతీయ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహా సంఘ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ అల్లూరి డిమాండ్‌ చేశారు.

  • భారతీయ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహా సంఘ్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భారతీయ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహా సంఘ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ అల్లూరి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.


ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం, ఓలా, ఉబర్‌ తరహాలో ప్రభుత్వ యాప్‌ తేవాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆటో డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షుడు దయానంద్‌ కోరారు. మహాలక్ష్మి పథకంతో గిరాకి లేక ఆటో డ్రైవర్ల కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 30 , 2025 | 04:06 AM