Bhadradri Kothagudem: పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం
ABN, Publish Date - Jun 28 , 2025 | 03:25 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ ఆర్టిజన్ కార్మికుడు మృతి చెందాడు.
నైట్రోజన్ సిలిండర్ పేలి ఆర్టిజన్ కార్మికుడి మృతి
పాల్వంచ టౌన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ ఆర్టిజన్ కార్మికుడు మృతి చెందాడు. శుక్రవారం టర్బైన్ ప్రాంతంలో పనులు జరుగుతుండగా ఒక్కసారిగా నైట్రోజన్ సిలిండర్ పేలింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పాల్వంచలోని ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన ఆర్టిజన్ కార్మికుడు ముద్రబోయిన సుబ్బారావు (48) ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు. సుబ్బారావుకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.
Updated Date - Jun 28 , 2025 | 03:25 AM