Jitender Reddy: కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కోశాధికారిగా జితేందర్ రెడ్డి
ABN, Publish Date - Jul 12 , 2025 | 05:16 AM
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కోశాధికారిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కోశాధికారిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జితేందర్ రెడ్డి.. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చారిత్రక క్లబ్‌కు ట్రెజరర్‌గా ఎన్నిక కావడంపై జితేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jul 12 , 2025 | 05:17 AM