ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: రూ.2.5 లక్షలు పలికిన మేకపోతు

ABN, Publish Date - Jun 07 , 2025 | 08:54 AM

ఓ మేకపోతు ధర అక్షరాలా రూ.2.5 లక్షలు. మీరు విన్నది, చదువుతున్నది కూడా నిజమే. బక్రీద్‌ పండుగ సందర్భంగా మేకపోతు, గొర్రెలను బోయినపల్లిలోని పెన్షన్‌ లైన్‌లో వేలం వేశారు. అయితే.. అందులో ఓ మేకపోతును రూ.2.5 లక్షలు పలికింది. ఇక వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్: బక్రీద్‌ సందర్భంగా మేకపోతు, గొర్రెలను బోయినపల్లిలోని పెన్షన్‌ లైన్‌లో వేలం వేస్తుంటారు. అందులో ఒకటి కర్ణాటక జాతికి చెందిన అంటెల్‌ మేకపోతు దీని ధర వేలు.. లక్ష.. రూపాయలు అనుకుంటే పొరపాటే. ఈ అంటెల్‌ మేకపోతు ధర అక్షరాలా రెండున్నర లక్షల రూపాయలు పలికింది. ఇది బోయినపల్లిలోని ఆజ్వా ఎక్సఓటిక్‌ ఫామ్‌కు చెందిన మేకపోతు. పంజాబ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆజ్మీర్‌, గుంటూరు, బంగ్లాదేశ్‌, బెంగాల్‌(Punjab, Karnataka, Maharashtra, Ajmer, Guntur, Bangladesh, Bengal)లతో పాటు, పలు ప్రాంతాలకు చెందిన బ్రీడ్‌ మేకపోతులను ఈ ఫామ్‌లో ప్రతి సంవత్సరం బక్రీద్‌ పండుగ కోసం ప్రత్యేకంగా పెంచుతున్నట్లు నిర్వాహకుడు షకీబ్‌ తెలిపారు.


ఇవి 120 నుండి 150 కిలోల పైనే బరువు తూగుతాయన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని బోయినపల్లిలోని పెన్షన్‌ లైన్‌ ఫామ్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన విక్రయాలను శుక్రవారం కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌ ప్రారంభించారు. అయితే గత సంవత్సరం ఆజ్మీర్‌ బ్రీడ్‌ తెల్లవి, నల్ల మేకలకు బాగా డిమాండ్‌ వచ్చింది.. కానీ ఈసారి కర్ణాటకకు చెందిన ఆంటెల్‌ మేకపోతు రెండున్నర లక్షల రూపాయలు పలికింది.


అయితే ఈ వేలం పాటను తిలకించడానికి వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్య లో ముస్లింలు వచ్చి మేకపోతులను, గొర్రెలను కొనుగోలు చేయడం విశేషం. ఈ సందర్భంగా నిర్వాహకుడు షకీబ్‌ మాట్లాడుతూ ప్రతీ ఏటా బక్రీద్‌ కోసం ప్రత్యేకంగా వివిధ రకాల మేకపోతు, గొర్రెలను పెంచి పండుగ ముందు రోజు వేలం వేస్తుంటామని తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక మేకపోతులను, గొర్రెలను కోసి కేవలం బిర్యాని వంట చేసి కులమతాలకు అతీతంగా నిరుపేదలకు పంచి పెట్టడం జరుగుతుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన

Read Latest Telangana News and National News

Updated Date - Jun 07 , 2025 | 08:54 AM