ENC Appointment: నీటిపారుదల శాఖ ఈఎన్‌సీగా అనిల్ కుమార్
ABN, Publish Date - Apr 24 , 2025 | 03:26 AM
నీటిపారుదల శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అనిల్ కుమార్‌ను ఈఎన్‌సీ(జనరల్)గా పూర్తిస్థాయిలో నియమించింది ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖలో కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఇంజనీర్-ఇన్-చీ ఫ్ (ఈఎన్‌సీ) పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈఎన్‌సీ(అడ్మిన్)గా ఉంటూ ఈఎన్‌సీ(జనరల్)గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గుమ్మడి అనిల్ కుమార్‌ను ఈఎన్‌సీ(జనరల్)గా పూర్తిస్థాయిలో నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, చీఫ్ ఇంజనీర్(ఎంక్వయిరీస్)గా పని చేస్తున్న మహ్మద్ అంజద్ హుస్సేన్‌కు ఈఎన్‌సీ(అడ్మిన్)గా, ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్(సీఈ) టి.శ్రీనివా్‌సకు ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం, క్వాలిటీ కంట్రోల్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరి నియామకాలకు సంబంధించిన ఫైలుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సంతకం చేశారు. ఆ వెంటనే నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 24 , 2025 | 03:26 AM