PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:11 PM
PSR Remand Report: పీఎస్‌ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంతా పథకం ప్రకారమే జరిగిందంటూ దర్యాప్తు అధికారి వెల్లడించారు.
అమరావతి, ఏప్రిల్ 23: నటి జెత్వాని కేసులో (Actress Jethvani Case) అరెస్ట్ అయిన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై నటి జెత్వాని కేసులో ఆమె, ఆమె తల్లిదండ్రులను పథకం ప్రకారమే ఆంజనేయులు అరెస్ట్ చేయించారని పోలీసులు తెలిపారు. ఆయన అప్పటిలో ఇంటెలిజెన్స్ బాస్‌గా ఉండటంతో ఆయన ఆదేశాలు మేరకే అక్రమ అరెస్టులు జరిగాయని.. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే ఈ అక్రమ అరెస్టులు జరిగాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, అప్పటి సీపీ కాంతి రాణా తాతా, విశాల్ గున్ని కాల్ రికార్డ్ డేటా కూడా స్పష్టంగా ఉందన్నారు. 2024 జనవరి 30 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు వీరి ముగ్గురి కాల్ డేటా కూడా సేకరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలిపారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు ముంబై పోలీస్ అధికారులతో కూడా ఆ సమయంలో టచ్‌లో ఉన్నారని తేలిందన్నారు.
ముందుగా నిర్ణయించడం వల్లే అసలు జెత్వానీపై కేసు రిజిస్టర్ చేయకముందే అంటే రెండు రోజులు ముందు ముంబై ఫ్లైట్ టికెట్స్ కొన్నారన్నారు. అసలు కుక్కల విద్యాసాగర్ ముంబై నటి జెత్వానీపై చేసిన ఫిర్యాదులో కూడా నిజం లేదని తేలిందని పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి న్యాయమూర్తి ముందు ఇచ్చిన 164 వాంగ్మూలం కూడా ఉన్నాయన్నారు. పైగా తనను విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్‌ను కూడా రిమాండ్ రిపోర్ట్‌లో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. తనని పీఎస్‌ఆర్ ఆంజనేయులు సీఎంవోకు పిలిపించి జెత్వానీని అరెస్ట్ చేసే టాస్క్ అప్పగించారని విశాల్ గున్ని చెప్పారు. తనకు అసలు ఈ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ టాస్క్ అప్పగించారని విశాల్ గున్ని చెప్పారు. తాను ఈ టాస్క్ పూర్తి చేస్తేనే తనను విశాఖకు రిలీవ్ చేస్తామని చెప్పారని కూడా వివరించారు.
Baramulla Encounter: పహల్గామ్ ప్రతీకారం..బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..
అప్పటి ఇంటెలిజెన్స్ బాస్‌గా ఉండటం, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అక్రమ అరెస్ట్ చేయించారని.. ఒక మహిళ వ్యక్తిగత స్వేచ్ఛ ను హరించారని.. అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఈ విషయం అప్పటి సీపీ కాంతి రాణా తాతా చెప్పారని.. ఆయన గో ఎహెడ్ అన్నారని రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు అసలు విచారణకు సహకరించలేదని.. ఆయన వద్ద నుంచి ఐఫోన్‌ను సీజ్ చేశామన్నారు. ఆయనను విచారించేందుకు మళ్ళీ కస్టడీకి కూడా తీసుకోవాల్సి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
PSR Court Hearing: జెత్వానీ కేసులో ఏం జరిగిందో చెప్పిన పీఎస్‌ఆర్
Read Latest AP News And Telugu News