Awards: నలుగురు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
ABN, Publish Date - Mar 18 , 2025 | 05:03 AM
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో నలుగురు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లు అవార్డులు సాఽధించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా అందజేత
బర్కత్‌పుర, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో నలుగురు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లు అవార్డులు సాఽధించారు. ఎ.జ్వాల కోటేశ్ (హైదరాబాద్), పి.అశోకుడు (హైదరాబాద్), వీరగోని హారీశ్ (వరంగల్), ముచ్చర్ల విజయ్ (నల్గొండ)కు ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డులు దక్కాయి. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ అవార్డులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పత్రికలలో ఎన్నో వార్తలు ప్రచురిత మైన పాఠకుల దృష్టిని ఆకర్షించేది ఫొటోలు మాత్రమేనని అన్నారు.
ఒక మంచి ఫొటో ఆలోచనలు రేకెత్తిస్తుందని పేర్కొన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఆలిండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహాత్ ఆలీ, తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 18 , 2025 | 05:03 AM