ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Skill Development: చదువుకుంటూ... ఉద్యోగం చేయొచ్చు!

ABN, Publish Date - Jul 08 , 2025 | 03:56 AM

చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా జీతం(స్టైపెండ్‌) పొందేందుకు వీలు కల్పించే ప్రత్యేక ప్రోగ్రామ్‌ను అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • ప్రతి నెలా రూ..7వేల-24 వేల స్టైపెండ్‌

  • అంబేడ్కర్‌ వర్సిటీలో సరికొత్త ప్రోగ్రాం

  • అంబేడ్కర్‌ వర్సిటీ, రాసి మధ్య ఎంవోయూ

హైదరాబాద్‌ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా జీతం(స్టైపెండ్‌) పొందేందుకు వీలు కల్పించే ప్రత్యేక ప్రోగ్రామ్‌ను అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌లోని వర్సిటీ క్యాంప్‌సలో సోమవారం రిటైలర్స్‌ అసోసియేషన్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(రాసి), అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. దీనిపై వర్సిటీ రిజిస్ర్టార్‌ డా.ఎల్వీకే రెడ్డి, రాసి ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ జేమ్స్‌ రాఫెల్‌ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రాసితో ఎంవోయూ కుదుర్చుకున్న మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం తమదేనన్నారు. చదువుతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఈ ఎంవోయూ దోహదపడుతుందని చెప్పారు. స్టైపెండ్‌ ఆధారిత విద్య (స్టైపెండ్‌ బేస్డ్‌ అప్రెంటి్‌సషిప్‌ ప్రోగ్రాం-ఎ్‌సఏపీ)ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. త్వరలో వర్సిటీ వెబ్‌ పోర్టల్‌లో పూర్తి వివరాలు తెలియజేస్తామని, రాసితో కలిసి ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్‌ ఇస్తామని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థికి చదువుతోపాటు ఉద్యోగ అవకాశం కల్పించడం, ఉత్సాహవంతులను వ్యాపారవేత్తలుగా మలచడమే తమ లక్ష్యమన్నారు. ఈ ప్రోగ్రాంలో చేరడం ద్వారా నెలకు కనీసంగా రూ.7 వేలు, గరిష్ఠంగా రూ.24 వేలకు మించి సంపాదించుకునే అవకాశాలు ఉంటాయన్నారు. తమ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులూ అర్హులేనని, ఈ ప్రోగ్రాంలో చేరేందుకు 18-28 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు. జేమ్స్‌ రాఫెల్‌ మాట్లాడుతూ ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారు చదువుతున్నప్పుడే ఆర్థికంగా సాయపడేలా స్టైపెండ్‌ అందించనున్నట్లు తెలిపారు.

కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంపై.. ఉత్తమ్‌ పవర్‌ ప్రజెంటేషన్‌ రేపు

హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కుంగిపోయిన మేడిగడ్డ.. సీపేజీ వస్తున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ‘కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యం-తుమ్మిడిహెట్టి పునరుద్ధరణ’ అంశంపై ఈ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది.

కాళేశ్వరంలో లేనివాళ్లకు పదోన్నతులు

కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేని వారందరికీ పదోన్నతులు కల్పించాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉత్తమ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలకు కారకులైన వారికి విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా షోకాజ్‌ నోటీసులు అందించిన విషయం విదితమే. ఆ నోటీసులు అందుకున్నవారు తప్ప.. అర్హత కలిగిన వారందరికీ పదోన్నతులు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Updated Date - Jul 08 , 2025 | 03:56 AM