Alphores Institutions: అల్ఫోర్స్ విద్యార్థుల అద్భుత ప్రతిభ
ABN, Publish Date - Jun 15 , 2025 | 04:15 AM
నీట్-2025 ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్‌రెడ్డి తెలిపారు.
సుభాష్‌నగర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నీట్-2025 ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని వావిలాలపల్లి అల్ఫోర్స్ మెయిన్ క్యాంప్‌సలో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పటిష్టమైన ప్రణాళికతో చేస్తున్న విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంఠిత దీక్ష, పట్టుదల, కృషితో ఇంతటి విజయాన్ని సాధించినట్లు చెప్పారు.
తక్కువమంది విద్యార్థులతో అధిక సీట్లు సాధించడం అల్ఫోర్స్ విజయాలకు నిదర్శనమన్నారు. అల్ఫోర్స్‌ను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jun 15 , 2025 | 04:15 AM