ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘పారా అథ్లెటిక్స్‌’లో కండక్టర్‌ కుమారుడికి పతకాలు

ABN, Publish Date - May 30 , 2025 | 05:21 AM

మొరాకోలో ఇటీవల జరిగిన ’వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రి’లో కూకట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్‌ బానోత్‌ మోహన్‌ కుమారుడు అకీరా నందన్‌ సత్తా చాటాడు.

  • సివిల్స్‌లో సాయి శివాని ప్రతిభ.. సన్మానించిన సజ్జనార్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): మొరాకోలో ఇటీవల జరిగిన ’వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రి’లో కూకట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్‌ బానోత్‌ మోహన్‌ కుమారుడు అకీరా నందన్‌ సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ బస్‌ భవన్‌లోని తన చాంబర్‌లో గురువారం అకీరా నందన్‌ను సన్మానించారు.


కుమారున్ని క్రీడల్లో ప్రోత్సహిస్తోన్న కండక్టర్‌ మోహన్‌ దంపతులను ఆయన ప్రశంసించారు. ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించిన వరంగల్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివానిని వీసీ సజ్జనార్‌ అభినందించారు. సాయి శివాని యువతకు స్పూర్తిగా నిలిచారని కొనియాడారు.

Updated Date - May 30 , 2025 | 05:21 AM