ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GHMC: ఆహా.. ఏం ఐడియా.. సొంత కార్లు.. అద్దె వాహనాలుగా..

ABN, Publish Date - Feb 11 , 2025 | 08:33 AM

జీహెచ్‌ఎంసీ(GHMC)లో కొందరు అధికారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రేటు కట్టి పౌర సేవలు.. బిల్లుల రూపకల్పన నుంచి చెల్లింపుల వరకు పర్సంటేజీలు.. అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీకి తీసుకునే అమ్యామ్యాలు చాలవన్నట్టు.. బల్దియా ఖజానాకు కన్నం వేస్తున్నారు.

- జీహెచ్‌ఎంసీలో 26 మంది అధికారులకు నోటీసులు

- ఈ తరహా వాహనాలపై ఆరా..

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)లో కొందరు అధికారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రేటు కట్టి పౌర సేవలు.. బిల్లుల రూపకల్పన నుంచి చెల్లింపుల వరకు పర్సంటేజీలు.. అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీకి తీసుకునే అమ్యామ్యాలు చాలవన్నట్టు.. బల్దియా ఖజానాకు కన్నం వేస్తున్నారు. సొంత కార్లను అద్దె వాహనాలుగా చూపి దోచుకుంటున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో వివరాలను పరిశీలించిన రవాణా విభాగం అధికారులు 26మందికి నోటీసులు జారీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Collector: ఉద్యోగులపై కలెక్టర్‌ నిఘా.. వేళలు పాటించని వారిపై కొరడా


ఏ వాహనాలు వినియోగిస్తున్నారు..? అవి సొంతమా..? ట్యాక్సీ ప్లేట్‌ వాహనాలా..? వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇందులో ఇంజనీరింగ్‌, పట్ణణ ప్రణాళికా, యూసీడీ, పారిశుధ్య నిర్వహణ తదితర విభాగాల అధికారులున్నట్టు సమాచారం. జీహెచ్‌ఎంసీ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ (డీఓసీ) పథకంలో భాగంగా గతంలో 400లకుపైగా కార్లను బ్యాంకు రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు అందించింది.


కొందరు అధికారులు డీఓసీ డ్రైవర్లను వేధించి.. తమ వద్ద పని చేయకుండా చేశారు. అనంతరం సొంత కార్లను అద్దె వాహనాలుగా వినియోగిస్తూ వచ్చారు. జీహెచ్‌ఎంసీలో దాదాపు 800 మంది అధికారులకు వాహన సదుపాయం ఉంది. ఇందులో సంస్థ సొంత, అద్దె వాహనాలున్నాయి. ప్రాథమిక పరిశీలనలో గుర్తించిన 26 మందికి నోటీసులు ఇవ్వగా.. కేంద్ర, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో సొంత కార్లను అద్దె వాహనాలుగా ఎంత మంది వినియోగిస్తున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు.


సొంత నంబర్‌ ప్లేట్‌ వాహనాలు ఎంత మంది వాడుతున్నారు..? వాటిలో అద్దె ఎన్ని వాహనాలకు చెల్లిస్తున్నారన్నది గుర్తిస్తే అక్రమాలు బయటపడుతాయని ఓ అధికారి తెలిపారు. సొంత కార్లను అద్దె వాహనాలుగా చూపుతోన్న అధికారులు 80 మందికిపైగా ఉంటారని రవాణా విభాగం వర్గాలు చెబుతున్నాయి. వీరికి నెలకు రూ.27.20 లక్షల చొప్పున యేటా రూ.3.26 కోట్లు చెల్లిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 08:33 AM