Electricity Employees: జెన్‌కో ఉద్యోగులకు 5% జనరేషన్ అలవెన్సు
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:17 AM
రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్, హైడల్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు 5 శాతం జనరేషన్ అలవెన్సును వర్తింపజేస్తూ ఆ సంస్థ సీఎండీ ఎస్.హరీశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాన్స్‌కో ఆర్టిజన్లకు ప్రత్యేక సీబీడీ అలవెన్సు
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్, హైడల్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు 5 శాతం జనరేషన్ అలవెన్సును వర్తింపజేస్తూ ఆ సంస్థ సీఎండీ ఎస్.హరీశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎ్‌స)-ఏడో దశ, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎ్‌స)లలో పనిచేసే ఉద్యోగులకు దీన్ని వర్తింపచేయనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలవిద్యుత్తు కేంద్రాల్లో పనిచేసే వారికీ ఈ అలవెన్సు అందనుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇటు ట్రాన్స్‌కోలోని సీబీడీ, ఎస్‌ఎంజీ, ఎంఆర్‌టీ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు గంపగుత్తగా ప్రత్యేక సీబీడీ అలవెన్సును వర్తింపజేస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్-2 వారికి నెలకు రూ.6వేలు, గ్రేడ్-3 వారికి రూ.8వేలు, గ్రేడ్-4 వారికి రూ.10వేల చొప్పున ఇవ్వనుంది.
Updated Date - Aug 02 , 2025 | 05:17 AM