Rice: 3 నెలల రేషన్ బియ్యం 30 వరకు పంపిణీ
ABN, Publish Date - Jun 10 , 2025 | 07:20 AM
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ నిర్ణీత గడువులోగా బియ్యం పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ రమేష్ తెలిపారు.
- జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ రమేష్
హైదరాబాద్ సిటీ: మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ నిర్ణీత గడువులోగా బియ్యం పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్‌షాపులు తెరిచి ఉంటాయన్నారు.
45 శాతం పంపిణీ పూర్తి
జిల్లా పరిధిలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 45 శాతం మందికి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేశామని ఆయన తెలిపారు. గ్రేటర్ శివారు ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా పరిధిలోని రేషన్ షాపుల్లో 50 శాతం పంపిణీ పూర్తయిందని జిల్లా రేషనింగ్ అధికారి తెలిపారు.
బియ్యం విక్రయిస్తే కార్డు రద్దు.. కేసు
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బియ్యం విక్రయిస్తూ పట్టుబడితే కార్డు రద్దు చేయడంతోపాటు కేసు నమోదు చేస్తామని డీసీఎ్‌సఓ రమేష్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారని, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
దుకాణాల వద్ద క్యూ
సన్న బియ్యం పంపిణీకి తోడు ఒకేసారి మూడు నెలల సరుకు పంపిణీ చేస్తుండడంతో దుకాణాల వద్ద భారీ రద్దీ ఉంటోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ పీడీఎస్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. బియ్యం పంపిణీకి ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా ఒక్కో నెలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్రలు పీఓఎస్ యంత్రంపై ఇవ్వాల్సి ఉండడంతో పంపిణీ నెమ్మదిగా కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు
నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 10 , 2025 | 07:20 AM