ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Technology Tips: మీ ఫోన్‌లో స్పై యాప్‌లు ఉన్నాయా.. వాటిని ఇలా గుర్తించి తొలగించండి..

ABN, Publish Date - Jun 23 , 2025 | 01:37 PM

మీ ఫోన్ వేడెక్కుతుందా? డేటా వేగంగా ఖాళీ అవుతుందా? అయితే, మీ సెల్ ఫోన్‌లో స్పై యాప్‌లు ఉండవచ్చు. కానీ, ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పై యాప్‌లను ఎలా గుర్తించాలి? వాటిని ఎలా తొలగించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Whatsapp

Technology Tips: ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక విడాకుల కేసులో భర్త తన భార్య వాట్సాప్ చాట్‌లను కోర్టులో సాక్ష్యంగా చూపించాడు. అయితే, అవి ఆమె అనుమతి లేకుండా స్పై యాప్‌ ద్వారా సేకరించాడు. భార్య అభ్యంతరం చెప్పినా కోర్టు ఆ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని విడాకులు మంజూరు చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, గోప్యత ఒక ప్రాథమిక హక్కు. అంటే, ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు. కానీ అది పరిమితులతో కూడినదేనని మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక విడాకుల కేసులో కోర్టు చెప్పింది. వివాహ బంధంలో ఉన్నప్పుడు కొన్ని గోప్యత హక్కులు కొంతవరకు నిబంధనలతో ఉంటాయని వెల్లడించింది. అయితే, ఇప్పుడు మనం మన ఫోన్‌లో ఇలాంటి స్పై యాప్‌లు ఉన్నాయా లేదా అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పై యాప్‌లను ఎలా గుర్తించాలి? వాటిని ఎలా తొలగించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మీ ఫోన్‌లో స్పై యాప్‌లు ఉన్నట్లయితే..

  • ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది.

  • మొబైల్ డేటా ఉపయోగించినా, ఉపయోగించకపోయానా త్వరగా అయిపోతుంది.

  • ఫోన్ వేడెక్కుతుంది.

Android ఫోన్‌లో స్పై యాప్‌లను ఎలా గుర్తించి తొలగించాలి?

  • సెట్టింగ్స్ లోకి వెళ్లి Apps క్లిక్ చేయండి. అందులో ఆల్ యాప్స్ లేదా మేనేజ్ యాప్స్ లోకి వెళ్లండి.

  • డివైస్ హెల్త్, సిస్టమ్ అప్‌డేట్ లేదా సర్వీస్ లాంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న యాప్‌లను చెక్ చేయండి.

  • షో సిస్టమ్ యాప్స్ క్లిక్ చేసి అందులోని సిస్టమ్ యాప్‌లను కూడా పరిశీలించండి.

  • అనుమానం వస్తే వాటిని డిజేబుల్ చేయండి లేదా అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

ఐఫోన్‌లో స్పై యాప్‌లు ఎలా గుర్తించి తొలగించాలి?

  • సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ క్లిక్ చేయండి. అందులో ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్లండి.

  • గుర్తు లేని లేదా మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు ఉన్నాయా చూసుకోండి.

  • అలాగే VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) & డివైస్ మేనేజ్మెంట్ సెక్షన్‌ను చెక్ చేయండి

  • అనుమానాస్పదంగా అనిపించిన యాప్‌లను వెంటనే డిలీట్ చేయండి.

అలాగే, వైర్ షార్క్ లాంటి నెట్‌వర్క్ మానిటరింగ్ టూల్స్ వాడి, ఏయే యాప్‌లు ఏ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నాయో చెక్ చేయండి. మీ Wi-Fi రౌటర్ లాగ్స్ చెక్ చేసి, మీ ఫోన్ నుంచి బయటకు వెళుతున్న అనుమానాస్పద కనెక్షన్‌లను గుర్తించండి. గోప్యత అంటే కేవలం వ్యక్తిగత విషయం కాదు. ఇది మీ భద్రత, స్వేచ్ఛకి సంబంధించిన హక్కు. కనుక, ఎవరూ మీపై నిఘా పెట్టకుండా ఉండాలంటే మీరు స్మార్ట్‌గా ఉండాలి. మీ ఫోన్‌ను తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద యాప్‌లు వెంటనే తొలగించండి.

Also Read:

భర్త నచ్చలేదని.. పెళ్లయిన నెలరోజులకే భార్య ఏం చేసిందంటే..

మీకు పదే పదే జలుబు వస్తోందా.. ఈ తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు..

For More National News

Updated Date - Jun 23 , 2025 | 04:10 PM