Chattisgarh : భర్త నచ్చలేదని.. పెళ్లయిన నెలరోజులకే భార్య ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:48 PM
Chattisgarh Newly Wed Kills Spouse: ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేశారు. కాపురానికి వచ్చిన మొదటి రోజు నుంచే భర్తను చూస్తుంటే ఎక్కడలేని కోపం ఆమెని కాల్చేసేది. నెలరోజుల్లోనే వీలు చిక్కినప్పుడల్లా చంపాలని ప్రయత్నించి.. చివరకు నాలుగోప్రయత్నంలో సక్సెస్ అయింది.
Balrampur bride poisons husband: సోనమ్ భర్త రాజారఘువంశీని హత్య చేసిన ఉదంతం మరువకముందే అలాంటి తరహాలోనే మరో ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. . పెళ్లైన నెల రోజులకే నవవధువు భర్తకు చికెన్ బిర్యానీలో పురుగుల మందు కలిపి తినిపించి చంపేసింది. అబ్బాయి నచ్చలేదని చెప్పినా ఇంట్లో వాళ్లు బలవంతంగా వివాహం చేయడంతో.. ఆమె ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, పెళ్లయిన నాటి నుంచి మూడుసార్లు భర్తను చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరగా నాల్గవ ప్రయత్నంలో అనుకున్నట్టుగానే హత్య చేసింది.
వివాహం అయిన 36 రోజులకే ఓ మహిళ తన భర్తకు విషం ఇచ్చి చంపింది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసుల ప్రకారం, 22 ఏళ్ల బుధ్‌నాథ్ కు, ఛత్తీస్‌గఢ్ లోని బిషన్పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల సునీతా సింగ్ కు మే 11న వివాహం జరిగింది. పెళ్లి అనంతరం కొన్ని రోజులు అత్తమామల ఇంట్లో ఉన్న సునీత.. తర్వాత పుట్టింటికి వెళ్లింది. అత్తమామలు, భర్త నుంచి పదే పదే పిలుపులు వచ్చినప్పటికీ ఆమె మెట్టినింటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో జూన్ 5న ఈ వివాదంపై ఊళ్లో పంచాయతీ జరిగింది. అనంతరం సునీత అయిష్టంగానే అత్తమామల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. భర్తతో కలిసి జీవించడం ఆమెకు అస్సలు నచ్చలేదు. దీంతో భర్తను వదిలించుకోవాలని హత్యా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అబ్బాయి నచ్చలేదని ఎంత మొత్తుకున్నా వినకుండా సునీతకు ఆమె కుటుంబం బలవంతంగా పెళ్లి చేసింది. వివాహం జరిగిన మూడు-నాలుగు రోజుల నుంచి ఆమె భర్తను చంపేందుకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. భర్త కోసం చికెన్ బిర్యానీ వండి అందులో విషం కలిపినట్లు వెల్లడించాడు. భోజనం చేసి పడుకున్న బుధ్‌నాథ్ ఎంతసేపటికి మేల్కొకపోవడంతో అతడి తల్లికి అనుమానం వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. దీంతో ఆమె రాంకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు మృతుడి భార్య సునీతను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అసలు నిజం ఒప్పుకుంది.
ఇవీ చదవండి:
గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి