ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PC Manager: విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..

ABN, Publish Date - May 18 , 2025 | 06:03 PM

మీ పీసీ నెమ్మదిస్తోందా? ఈ యాప్ ఒక్కసారి ట్రై చేస్తే సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Windows 11 speed boost

ఇంటర్నెట్ డెస్క్: కంప్యూటర్ ఏదైనా సరే కొంత కాలం తరువాత నెమ్మదిస్తుంది. వేగం తగ్గిపోతుంది. అయితే, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే విండోస్ యూజర్లకు ఓ చక్కని పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఒక్క క్లిక్‌తో అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయని అంటున్నారు. చిటికెలో పీసీ మునుపటిలా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుందని చెబుతున్నారు. ఏమిటా యాప్ అని అంటారా? అదే.. పీజీ మేనేజర్.

పీజీ మేనేజర్ పూర్తిగా ఉచితమని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుని రన్ చేస్తే క్షణాల్లో కంప్యూటర్ వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. విండోస్ పీసీ వాడే వారు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కంప్యూటర్ మళ్లి వేగంగా పనిచేసేలా చేసేందుకు ఈ యాప్‌లో.. డిస్క్ క్లీనప్, స్టార్టప్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ టూల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాప్ డ్యాష్ బోర్డులో ఈ ఫీచర్స్‌ను సులువుగా అర్థమయ్యేలా అమర్చారు. ఇది విండోస్ 11యూజర్లతో పాటు విండోస్ 10 యూజర్లకూ ఉపయోగపడుతుంది. ఈ యాప్ పీసీలోని సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరిస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా అధికారిక పీసీ మేనేజర్‌ యాప్ వెబ్‌సైట్ నుంచి నేరుగా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక బూస్ట్ బటన్‌ను ప్రెస్ చేయగానే సిస్టమ్స్‌లో పాత ఫైల్స్, తాత్కాలిక ఫైల్స్, కేచ్ డాటా వంటివాటిని తొలగిస్తుంది. దీంతో, ఒక్కసారిగా కంప్యూటర్ వేగం పెరుగుతుంది. పీసీ నెమ్మదిస్తుండటానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ యాప్ ద్వారా హెల్త్ చెకప్ స్కాన్‌ను కూడా రన్ చేసుకోవచ్చు. ఔట్ డేటెడ్ డ్రైవర్స్, సెక్యూరిటీ రిస్క్‌లు, స్టార్టప్ సమయంలో ప్రతిబంధకంగా మారిన అంశాలను హెల్త్ చెకప్‌తో గుర్తించి పరిష్కరించుకోవచ్చు. కొన్ని నిమిషాల్లో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

పీసీ నెమ్మదించడానికి స్టోరేజ్ తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. సిస్టమ్‌లో నిరుపయోగంగా మారిన డాటా, పాత డౌన్‌లోడ్స్, తాత్కాలిక యాప్ ఫైల్స్‌ను పీసీ మేనేజర్‌తో డిలీట్ చేసి సిస్టమ్ వేగం పెంచుకోవచ్చు.


కంప్యూటర్ స్టార్ట్ అయ్యే సమయంలో ఒకేసారి బోలెడన్నీ ప్రోగ్రామ్స్ లాంచ్ అయితే కూడా కంప్యూటర్ సరిగా పనిచేయదు. నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఇలా ఇబ్బంది పెడుతున్న ప్రోగ్రామ్స్‌ను పీసీ మేనేజర్‌తో డిజేబుల్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ సీపీయూ, రామ్ సామర్థ్యాలను ఎంతగా వినియోగిస్తోందనే అంశాలను కూడా రియల్ టైమ్‌లో చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చు. మరి మీరూ ఓసారి పీసీ మేనేజర్‌ను ట్రై చేసి చూడండి. ‌

ఇవి కూడా చదవండి

ఇంట్లో వైఫై రౌటర్ ఉందా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా

Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా

Read Latest and Technology News

Updated Date - May 18 , 2025 | 06:07 PM