Share News

Smart Phone Camera Uses: మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా

ABN , Publish Date - May 18 , 2025 | 03:36 PM

స్మార్ట్‌ ఫోన్ కెమెరాతో ఫొటోలు తీసుకునేందుకే పరిమితం కావొద్దు. వీటితో ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Smart Phone Camera Uses: మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా
Smart Phone Camera Uses

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ కెమెరా అంటే సాధారణంగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకే ఉపయోగిస్తాం. అయితే, దీనితో మరెన్నో ఇతర ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ కెమెరాతో రోజువారీ ఎదురయ్యే అనేక పనులను చిటికెలో చక్కబెట్టుకోవచ్చని అంటున్నారు. మరి ఈ ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

మీరు చదివే ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను డిటిటైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే, కెమెరా ఆధారిత స్కానింగ్ యాప్స్‌ను ఎంచుకుంటే ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను క్షణాల్లో డిజిటల్ కాపీలుగా మార్చుకోవచ్చు. అడోబీ స్కాన్, మైక్రోసాఫ్ట్ లెన్స్ వంటివాటిని ఇందుకు ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత వీటిని నేరుగా వన్ డ్రైవ్ లేదా వన్‌నోట్‌లో స్టోర్ చేసుకోవచ్చు.


కెమెరా ఆధారిత అనువాద యాప్స్ కూడా బోలెడు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో కొత్త భాషలో ఉన్న బోర్డులు వంటి వాటిని ఫొటో తీసి వెంటనే అనువదించుకోవచ్చు. గూగుల్ లెన్స్‌తో ఇలాంటి పనులు సులువుగా చేసుకోవచ్చు.

కొన్ని ఏఐ ఆధారిత యాప్స్‌తో ఫొటోలు తీసుకుని అవేంటో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

కొన్ని రకాల యాప్స్‌తో వస్తువులపై ఉన్న బార్ కోడ్స్‌ను కెమెరాతో స్కాన్ చేయొచ్చు. ఇలా చేసి పలు వస్తువులను ధరలను పోల్చి చూసి నచ్చినవి ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ యాప్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

కొన్ని కెమెరా ఆధారిత యాప్స్ చర్మ ఆరోగ్యాన్ని పరిశీలించి ఆరోగ్య స్థితిని అంచనా వేస్తాయి. ఇలాంటి యాప్స్ సాయంతో ఫొటోలు తీసుకుని ఆరోగ్యంపై ఓ అంచనాకు రావచ్చు. స్కిన్ విజన్ వంటి యాప్స్ ఇందుకు ఉపయోగపడతాయి.


కెమెరా ఆధారిత ఫేస్ రికగ్నిషన్ యాప్స్‌తో సురక్షిత పద్ధతిలో లాగిన్ కావచ్చు. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను భద్ర పరుచుకోవచ్చు.

కెమెరాతో ఉన్న ఈ ఉపయోగాలపై అవగాహన పెంచుకుంటే రోజూ చేసే పనులు మరింత సులువైపోతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి మీరూ ఓసారి వీటిని ట్రై చేసి చూడండి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో వైఫై రౌటర్ ఉందా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

AIతో GenZ పెళ్లిళ్లు.. తాజా సర్వేలో బయటపడ్డ సంచలన విషయాలు

ICAR Chief Ayyappan: విషాదం.. కావేరీ నదిలో శవమై తేలిన ICAR మాజీ చీఫ్

Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా

Read Latest and Technology News

Updated Date - May 18 , 2025 | 03:42 PM