ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Android Hidden Settings: స్మార్ట్ ఫోన్‌లో సీక్రెట్ సెట్టింగ్స్.. వీటిని సరిగ్గా వాడుకుంటే..

ABN, Publish Date - Aug 24 , 2025 | 08:44 AM

స్మార్ట్ ఫోన్స్‌లో చాలా మందికి తెలియని కొన్ని సెట్టింగ్స్‌ను యూజర్లు తమ అభిరుచికి తగ్గట్టు వినియోగించుకుంటే ఫోన్ పర్‌ఫార్మెన్స్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సెట్టింట్స్‌ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Smartphone Settings Tips

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కొన్ని సెట్టింట్స్ మార్చాలని నిపుణులు చెబుతున్నారు. చాలా తక్కువ మందికి తెలిసిన ఈ సెట్టింగ్స్ ఏంటో, వీటిని మారిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో కూడా నిపుణులు వివరిస్తున్నారు. మరి వీటిపై ఓ లుక్కేద్దాం పదండి.

సెట్టింగ్స్‌లోని బిల్డ్ నెంబర్‌పై ఏడు సార్లు వేలితో తడితే డెవలపర్ ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయి. వీటి సాయంతో యానిమేషన్స్ వేగవంతం చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే ప్రాసెస్‌లను పరిమితం చేయడం, యూఎస్‌బీ డీబగ్గింగ్, ఇతర అడ్వాన్స్‌డ్ కంట్రోల్స్ వంటివి వినియోగించుకుని ఫోన్‌ను నచ్చినట్టు మలుచుకోవచ్చు.

సెట్టింట్స్‌లోని యాక్సెసబిలిటీ ఆప్షన్‌లో టచ్‌ను ఎంచుకుని డబుల్ లేదా ట్రిపుల్ బ్యాక్ టాప్‌ ఆప్షన్‌కు పలు ఫీచర్‌లను జత చేయొచ్చు. ఈ విధానం ద్వారా డబుల్ లేదా ట్రిపుల్ ట్యాప్ చేసి స్క్రీన్ షాట్స్, యాప్స్ లాంఛ్ చేయడం వంటివి చేయొచ్చు.

ఐఓఎస్‌లోని ‘రిక్వెస్ట్ టూ ట్రాక్’ ఆప్షన్, ఆండ్రాయిడ్‌లోని ‘ఆప్ట్ ఔట్ ఆఫ్ యాడ్స్ పర్సనలైజేషన్’ ద్వారా వివిధ యాప్స్ మన అభిరుచుల గురించి తెలుసుకోకుండా చేయొచ్చు. దీని వల్ల వ్యక్తిగత గోప్యతను రక్షించుకోవడమే కాకుండా టార్గెటెడ్ యాడ్స్ బెడద తగ్గుతుంది.

ఐఓఎస్‌లోని మోషన్ టాగుల్‌ను రెడ్యూస్ మోషన్‌లో సెట్ చేసుకున్నా, ఆండ్రాయిడ్‌లోని డెవలపర్ ఆప్షన్స్‌లో యానిమేషన్‌ స్కేల్‌ను తగ్గించినా ఫోన్ వేగవంతమైన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.

ఐఓఎస్‌లోని వైఫై అసిస్ట్ ఆప్షన్‌తో వైఫై నెట్ స్పీడ్‌ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మొబైల్ ఇంటర్నెట్‌కు మారేలా సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లోని అడాప్టివ్ కనెక్టివిటీ ఆప్షన్‌తో బ్యాటరీ చార్జింగ్ పొదుపు చేసుకునేలా 5జీ,4జీ మధ్య ఆటోమేటిక్‌గా ఫోన్ మారేలా మార్పు చేసుకోవచ్చు.

పెద్ద స్క్రీన్ ఫోన్స్ ఉన్న వారు వన్ హ్యాండెడ్ మోడ్‌ను ఎంచుకుంటే స్క్రీన్‌ను ఒక్క చేత్తో హ్యాండిల్ చేయడం సులభం అవుతుంది. ఆండ్రాయిడ్‌లోని సెట్టింగ్స్‌ జెస్చర్, ఐఓఎస్‌లో రీచబిలిటీ ఆప్షన్‌తో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఏయే యాప్స్‌ ఫోన్‌‌లోని కెమెరా, మైక్, లొకేషన్ వంటి వాటిని యాక్సెస్ చేస్తున్నాయో అనే విషయాన్ని ఆండ్రాయిడ్‌లోని పర్మిషన్ మేనేజర్ ఆప్షన్ లేదా ఐఓఎస్ డివైజ్‌లోని ప్రైవెసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. అవసరం లేని యాప్స్‌కు వీటిని నిరాకరించొచ్చు. ఈ ఫీచర్స్‌ను అవసరానికి తగ్గట్టు వినియోగించుకుంటే ఫోన్ మరింత మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

భారతీయులకు ఓపెన్ ఏఐ బంపర్ ఆఫర్.. కేవలం రూ.399లకే..

వామ్మో.. ఇంత చిన్న సైజు మొబైల్ ఫోన్‌లు కూడా ఉంటాయని మీకు తెలుసా

Read Latest and Technology News

Updated Date - Aug 24 , 2025 | 09:04 AM