Share News

ChatGPT GO: భారతీయులకు ఓపెన్ ఏఐ బంపర్ ఆఫర్.. కేవలం రూ.399లకే..

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:44 PM

భారతీయుల కోసం ఓపెన్ ఏఐ.. చాట్‌జీపీటీ గో పేరిట ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐతో చెల్లింపులు జరిపేలా కేవలం రూ.399కే ఈ ప్లాన్‌ను ఓపెన్ ఏఐ తాజాగా లాంఛ్ చేసింది.

ChatGPT GO: భారతీయులకు ఓపెన్ ఏఐ బంపర్ ఆఫర్.. కేవలం రూ.399లకే..
ChatGPT Go plan India

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీకి భారత్ అతి ముఖ్యమైన మార్కెట్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో భారతీయుల అభిమతాలకు ప్రాధాన్యమిస్తూ ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీ గో పేరిట ప్రత్యేక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో మాత్రమే అందుబాటులో ఉండేలా రూ.399కు ఈ సబ్‌స్క్రీప్షన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. భారతీయులు అత్యధికంగా వినియోగించే యూపీఐ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు కూడా అనుమతించింది. ప్రత్యేకంగా ఓ దేశం కోసం ఓపెన్ ఏఐ కొత్త సబ్‌స్క్రీప్షన్ ప్లాన్‌ను లాంఛ్ చేయడం ఇదే తొలిసారి. దీంతో, సంస్థ దృష్టిలో భారతీయ మార్కెట్‌కు ఉన్న ప్రాధాన్యత ఎంతో తెలిసిపోతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం ఓపెన్ ఏఐకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్‌లో దీని వినియోగం చాలా విస్తృతంగా ఉంది. ఈ అంశాలను దృష్టి పెట్టుకుని తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ‘చాట్‌జీపీటీ గో’ను లాంచ్ చేసింది.


ప్లాన్‌తో ఉపయోగాలు ఇవీ..

ఇప్పటికే ఓపెన్ ఏఐ.. వ్యక్తిగత అవరాల కోసం చాట్‌జీపీటీ ప్లస్, ప్రో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు అందుబాటులోకి తెచ్చింది. పస్ల్ ప్యాకేజీ ధర నెలకు రూ.1999. ఇంతకంటే పలు రెట్ల తక్కువ ధరకే గో ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి చాట్‌జీపీటీ ఫ్రీ ప్లాన్‌తో పోలిస్తే 10 రెట్లు అధికంగా మెసేజీలు, ఇమేజ్ జనరేషన్, ఫైల్‌ అప్‌లోడ్స్ పరిమితులు లభిస్తాయి. వ్యక్తిగత అవసరాల కోసం మెమరీ నిడివిని కూడా రెండు రెట్లు పెంచారు. ఈ ప్లాన్‌‌లో కూడా ఓపెన్ ఏఐ లేటెస్ట్ మోడల్ అయిన చాట్‌జీపీటీ-5 అందుబాటులో ఉంటుంది.

యూఐపీ ద్వారా గో ప్లాన్‌లో చెల్లింపులకు అవకాశం కల్పించడం భారతీయులకు లాభించే మరో ముఖ్య అంశం. ఇప్పటివరకూ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులకు అవకాశం ఉండేది. దీంతో, అనేక మంది సబ్‌స్క్రిప్షన్‌కు దూరంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపులకు కూడా ఓపెన్ ఏఐ అవకాశం కల్పించింది. ముఖ్యంగా రోజువారి యూజర్లకు ఉపయోగపడేలా ఈ ప్లాన్ సిద్ధం చేసినట్టు సంస్థ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

వామ్మో.. ఇంత చిన్న సైజు మొబైల్ ఫోన్‌లు కూడా ఉంటాయని మీకు తెలుసా

వామ్మో.. చాట్‌జీపీటీకి ఇంత డిమాండా.. ఎంత ఆదాయం వస్తోందో తెలిస్తే..

Read Latest and Technology News

Updated Date - Aug 19 , 2025 | 02:57 PM