Smallest Mobile Phones: వామ్మో.. ఇంత చిన్న సైజు మొబైల్ ఫోన్‌లు కూడా ఉంటాయని మీకు తెలుసా
ABN , Publish Date - Aug 18 , 2025 | 02:41 PM
భారీ స్క్రీన్‌లు ఉన్న స్మార్ట్ ఫోన్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అతి చిన్న ఫోన్‌లకు కూడా కొంత డిమాండ్ ఉంది. మరి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అతి చిన్న ఫోన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం అందరూ బిగ్ స్క్రీన్స్ ఉన్న ఫోన్స్‌ను ఇష్టపడుతున్నారు. మూవీస్ చూసేందుకు, వీడియో గేమ్స్ ఆడేందుకు వీటిని ఎంచుకుంటున్నారు. చాలా మంది చేతుల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, చిన్న ఫీచర్ ఫోన్లు ఎంచుకునే వారూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన చిన్న ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ప్రపంచంలో అత్యంత చిన్న మొబైల్ ఫోన్‌లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
జాంకో టైనీ టీ1
ప్రపంచంలో అత్యంత చిన్న ఫోన్ ఇదే. దీని పొడవు 46.7 మిల్లీమీటర్లు, బరువు జస్ట్ 13 గ్రాములు. ఇది 2జీ నెట్‌వర్క్ ఆధారిత ఫోన్. స్క్రీన్ సైజు 0.49 అంగుళాలు. ఇందులో గరిష్ఠంగా 300 కాంటాక్ట్ నెంబర్‌లను సేవ్ చేసుకోవచ్చు. 200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ అగ్గిపెట్టెలో పట్టేంత సైజులో మాత్రమే ఉంటుంది.

జాంకో టైనీ టీ2
టైనీ టీ1కు మరిన్ని మెరుగులు అద్ది టైనీ టీ2ను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. దీంతో, 3జీ సపోర్టు, కెమెరా, 128 ఎమ్‌బీ ర్యామ్, 64 ఎమ్‌బీ ఇంటర్నెల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ వారం వరకూ సరిపోతుంది. ఈ ఫోన్‌లో పాటలు, వీడియోలు వంటివి వాటిని ఎంజాయ్ చేయొచ్చు.

యూనీహెర్జ్స్ జెల్లీ 4జీ ఫోన్..
ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన 4జీ ఫోన్‌గా పేరుపొందింది. ఇందులో 3 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 11, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ భద్రతా ఫీచర్, కూడా ఇందులో ఉంది. దీని బరువు జస్ట్ 110 గ్రాములు.

లైట్ ఫోన్ 2
ఇందులో ఈ-ఇంక్ డిస్‌ప్లే, 4జీ నెట్‌వర్క్ సపోర్టు ఉంది. సోషల్ మీడియా, గేమ్స్, ఇతర యాప్స్ వంటివి ఇందులో ఉండవు. ప్రీమియమ్ లుక్స్, మంచి బ్యాటరీ లైఫ్ దీని సొంతం.

క్యోసెరా కేవై-01ఎల్
ప్రపంచంలో అత్యంత సన్నని ఫోన్‌గా ఇది పేరు గాంచింది. ఇది కేవలం 5.3 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. బరువు జస్ట్ 47 గ్రాములు. 2.8 అంగుళాల మోనోక్రోమ్ డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌ను కేవలం కాల్స్, మెసేజీలు, నెట్ బ్రౌజింగ్‌కు మాత్రమే వినియోగించొచ్చు. చూడటానికి క్రెడిట్ కార్డు లాగా ఉండే ఈ ఫోన్ జపాన్‌లో బాగా పాప్యులర్.

ఇవి కూడా చదవండి:
నేను గూగుల్‌ను చివరిసారిగా ఎప్పుడు వాడానో గుర్తు కూడా లేదు: ఓపెన్ ఏఐ సీఈఓ
చాట్‌జీపీటీ-5పై విమర్శలు.. అది పెద్ద తప్పేనన్న సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
Read Latest and Technology News