ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aravind Srinivas: యూట్యూబ్, మ్యాప్స్‌ను అధిగమించడం అసంభవం.. తేల్చి చెప్పిన పర్‌ప్లెక్సిటీ సీఈఓ

ABN, Publish Date - Oct 24 , 2025 | 11:35 PM

గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్‌ను అధిగమించడం దాదాపు అసంభవమని పర్‌ప్లెక్సిటీ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్స్‌ను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.

Aravind Srinivas comments on Google Ecosystem

ఇంటర్నెట్ డెస్క్: పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ తాజాగా గూగుల్ వ్యవస్థపై చేసిన కామెంట్స్ అంతర్జాలంలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గూగుల్‌ ఉత్పత్తులను అధిగమించడం ఏ అంకుర సంస్థకూ సాధ్యం కాదంటూ అభినవ్ అనే వ్యక్తి చేసిన కామెంట్‌తో ఈ చర్చ మొదలైంది (Perplexity CEO Aravind Srinivas).

మ్యాప్స్, జీమెయిల్, జెమినీ, కాలెండర్ లాంటి అన్ని గూగుల్ ఉత్పత్తుల స్క్రీన్ షాట్స్‌ను అభినవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఓ వ్యవస్థగా మారిన గూగుల్‌ను అధిగమించడం ఏ స్టార్టప్ సంస్థకు సాధ్యం కాదని అన్నారు. ఈ పోస్టును అరవింద్ శ్రీనివాస్ రిపోర్టు చేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యూట్యూబ్, మ్యాప్స్‌ను ఓవర్ టేక్ చేయడం చాలా కష్టమని, దాదాపు అసాధ్యమని అభిప్రాయపడ్డారు. మిగతా యాప్స్‌ మార్కెట్‌ను చేజిక్కించుకోవచ్చని చెప్పారు (StartUps Overtaking Google Ecosystem).

ఈ కామెంట్స్‌పై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గూగుల్‌ను వెనక్కు నెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఎందుకు కష్టమో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

గూగుల్ యాప్స్‌లోని వ్యవస్థలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానం అయి ఉన్నాయని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరి ఫొటోలు, డేటా, మ్యాప్ లోకేషన్స్ అన్నీ గూగుల్ వద్ద ఉన్నాయని, ఫలితంగా గూగుల్ ఏఐ యాప్ జెమినీని అధిగమించడం దాదాపు అసాధ్యమని అన్నారు. ఏఐ రేసులో అంతిమంగా జెమినీదే విజయం అని స్పష్టం చేశారు.

కొందరు గూగుల్ మ్యాప్స్‌పై స్పందించారు. ప్రస్తుతం భూమండలం మ్యాప్ మొత్తం ఓపెన్ సోర్సుగా ఉచితంగానే అందుబాటులో ఉందని చెప్పారు. వీటికి శాటిలైట్ ఇమేజీలను, కచ్చితమైన సమాచారాన్ని జోడిస్తే గూగుల్ మ్యాప్స్‌కు పోటీ ఇవ్వడం సాధ్యమేనని అన్నారు. అయితే, లొకేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం మాత్రం కాస్త కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జోహో కార్పొరేషన్, గూగుల్ యాప్స్‌కు పలు ప్రత్యామ్నాయాలను రూపొందించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్

గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీని ఇస్తున్న మ్యాపుల్స్.. ఈ ఫీచర్స్ మాత్రం అదుర్స్!

Read Latest and Technology News

Updated Date - Oct 25 , 2025 | 12:01 AM