Share News

Geoffrey Hinton: సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్

ABN , Publish Date - Oct 24 , 2025 | 10:49 PM

సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అభివృద్ధిపై నిషేధం విధించాలని పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులు డిమాండ్ చేశారు. మానవుల స్థానాన్ని భర్తీ చేసే సాంకేతికత అవసరం లేదని చెప్పారు.

Geoffrey Hinton: సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్
Geoffrey Hinton

ఇంటర్నెట్ డెస్క్: సూపర్ఇంటెలిజెంట్ ఏఐ‌పై నిషేధం విధించాలని ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఏఐ సాంకేతికతకు పునాదులు వేసిన జాఫ్రీ (Geoffrey Hinton).. ఏఐకి గాడ్ ఫాదర్‌గా పేరుపొందారు. అయితే, ఈ సాంకేతికతతో మానవాళికి ముప్పు ఉందని ఆయన చెబుతున్నారు. సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధాన్ని కోరుతూ ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై జాఫ్రీ హింటన్‌తో పాటు యాపిల్ సహవ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్, బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, ఆర్థిక వేత్త డారెన్ అసిమోగ్లూ, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు సూసన్ రైస్ సంతకాలు చేశారు. ఈ టెక్నాలజీతో మానవసమాజానికి హానీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏకాభిప్రాయానికి రావాలని అన్నారు. ఆ తరువాతే సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు (Superintelligent AI ban).


మనుషులకు ఏఐ సహాయకారిగా ఉండాలి కానీ మనుషులనే తొలగించేలా ఉండకూడదని ప్రిన్స్ హ్యారీ అభిప్రాయపడ్డారు. రోగాల నివారణ, జాతీయ భద్రతకు ఏఐ సాధనాలను వినియోగించినా, మనుషుల్లా ప్రవర్తించే ఏఐ అవసరం సమాజానికి ఎంత ఉందని ఆయన ప్రశ్నించారు. సూపర్ఇంటెలిజెన్స్ అని పదే పదే చెబుతున్న టెక్ సంస్థలు అసలు ఏం కోరుకుంటున్నాయని ప్రశ్నించారు. మనుషుల కంటే తెలివైన సూపర్ ఇంటెలిజెంట్ ఏఐని అభివృద్ధి చేయడం ప్రమాదకరమే కాకుండా అనైతికమని కూడా శ్వేతసౌధం ఎవాంజెలికల్ అడ్వైజర్ జానీ మూర్ అభిప్రాయపడ్డారు. ఇది అనవసరమని కూడా స్పష్టం చేశారు.

మనుషులకంటే మేధో సామర్థ్యాలు ఎక్కువగా ఉన్న వ్యవస్థలను సూపర్ ఇంటెలిజెంట్ ఏఐగా పిలుస్తారు. దీని అభివృద్ధిపై జనాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నా మెటా, ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు మాత్రం తమ పరిశోధనలను ముమ్మరం చేస్తున్నాయి. 2030 కల్లా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ అందుబాటులోకి రావొచ్చని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఏఐతో జాబ్స్ అన్నీ పోతాయ్.. అప్పుడే అసలైన స్వేచ్ఛ.. ఎలాన్ మస్క్ పోస్టు వైరల్

గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీని ఇస్తున్న మ్యాపుల్స్.. ఈ ఫీచర్స్ మాత్రం అదుర్స్!

Read Latest and Technology News

Updated Date - Oct 25 , 2025 | 12:04 AM