ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nano Banana WhatsApp: నానో బనానా ఇప్పుడు వాట్సాప్‌లో.. మీ ఫోటోలను స్టైలిష్ ఇమేజ్‌లుగా మార్చుకోండి

ABN, Publish Date - Sep 21 , 2025 | 09:06 AM

గూగుల్ జెమినీ తీసుకువచ్చిన నానో బనానా ఫీచర్ ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. ఇప్పుడీ విధానం వాట్సాప్‌లోనూ వచ్చేసింది. అది కూడా ఎలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Nano Banana WhatsApp

టెక్ ప్రపంచంలో రోజురోజుకూ కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్..యూజర్లకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది. అదే ఏఐ సాయంతో క్రియేటివ్ ఇమేజ్‌లను సృష్టించే అవకాశం. గూగుల్ జెమినీ నానో బనానా (Nano Banana) ఫీచర్ మాదిరిగా, పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థ వాట్సాప్ యూజర్ల కోసం (WhatsApp photo editor) ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఎలాంటి యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు అవసరం లేకుండానే, కేవలం వాట్సాప్ ద్వారా ఆకర్షణీయమైన చిత్రాలను సృష్టించుకోవచ్చు.

నానో బనానా ఇమేజ్‌లు అంటే ఏంటి?

నానో బనానా అనేది గూగుల్ జెమినీ పరిచయం చేసిన AI ఆధారిత ఇమేజ్ జనరేషన్ ఫీచర్. ఇది ఆగస్టు 26, 2025న లాంచ్ అయినప్పటి నుంచి అతి తక్కువ సమయంలో 50 కోట్లకు పైగా చిత్రాలను సృష్టించి, వైరల్ ట్రెండ్‌గా మారింది. ఈ ఫీచర్ ద్వారా రెట్రో స్టైల్ పోర్ట్రెట్‌లు, స్టైలిష్ దుస్తులు, సాంప్రదాయ చీర లుక్‌ వంటి అనేక రకాల చిత్రాలను సృష్టించుకోవచ్చు. ఇప్పుడు ఈ సదుపాయం పెర్ప్లెక్సిటీ AI సహకారంతో వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.

ఎలా సృష్టించాలి?

  • వాట్సాప్‌లో AI ఇమేజ్‌లను సృష్టించడం చాలా సులభం. దీనికి గూగుల్ AI స్టూడియో లేదా జెమినీ యాప్ అవసరం లేదు. కేవలం ఈ సింపుల్ స్టెప్స్ పాటించండి.

  • మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ ఓపెన్ చేయండి

  • ఈ నంబర్‌కు మెసేజ్ చేయండి +1 (833) 436-3285

  • ఇది మీరు పెర్ప్లెక్సిటీ నానో బనానా బాట్‌కు కనెక్ట్ చేస్తుంది

  • మీరు ఎడిట్ చేయాలనుకున్న ఫోటోను అప్‌లోడ్ చేయండి

  • మీకు కావాల్సిన ఇమేజ్ స్టైల్‌ను వివరిస్తూ ఒక ప్రాంప్ట్ (ఆంగ్లంలో లేదా మీ సొంత భాషలో) టైప్ చేయండి. ఉదాహరణకు రెట్రో బాలీవుడ్ స్టైల్ పోర్ట్రెట్ 4K లేదా మోడరన్ చీర ఫ్యాషన్ లుక్ అని రాయవచ్చు.

  • ఆ క్రమంలో మీకు కొన్ని సెకన్లలోనే ఏఐ ఇమేజ్ సిద్ధం అవుతుంది

  • మీ ప్రాంప్ట్ ఎంత స్పష్టంగా ఉంటే, అంత మంచి నాణ్యతతో చిత్రం వస్తుంది. కాబట్టి, మీరు ఏ స్టైల్ కావాలో స్పష్టంగా వివరించండి.

ఈ ఫీచర్ ఉచితమేనా?

ప్రస్తుతం ఈ ఫీచర్ ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే, భవిష్యత్తులో దీన్ని పెర్ప్లెక్సిటీ పెయిడ్ సర్వీస్‌గా మార్చవచ్చని సమాచారం. గూగుల్ జెమినీలో నానో బనానా ఫీచర్ ప్రస్తుతం ఉచితంగా ఉన్నప్పటికీ, వాట్సాప్‌లో పెర్ప్లెక్సిటీ ఈ ఫీచర్‌ను ఎలా కొనసాగిస్తుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 09:34 AM