ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Meta AI App: చాట్ జీపీటీకి పోటిగా మెటా నుంచి కొత్త ఏఐ యాప్..పోటీ ఇస్తుందా..

ABN, Publish Date - Apr 30 , 2025 | 05:30 PM

మెటా నుంచి కొత్త ఏఐ యాప్ వచ్చేసింది. ఇది చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఉచితంగా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Meta Launches New meta AI App

చాట్ జీపీటీకి యూజర్ బేస్ పెరిగిన నేపథ్యంలో అనేక ఏఐలు పోటీగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో మెటా నుంచి కూడా తాజాగా కొత్త ఏఐ యాప్ వెలుగులోకి వచ్చింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కలగిన ఈ యాప్, చాట్‌బాట్ రంగంలో చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై ఉచితంగా అందుబాటులో ఉంది. దీని ఇంటర్‌ఫేస్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, దీని ప్రతిస్పందనలు మరింత సహజంగా, మనిషిలా అనిపించేలా రూపొందించారు. కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా చాట్, రచనలు, హ్యూమర్, సహాయక సమాచారం ఇలా అనేక రంగాల గురించి అద్భుతంగా సమాచారం అందిస్తుంది.


వాయిస్‌ సంభాషణ

మెటా ఏఐ యాప్‌లో వాయిస్ చాట్ మోడ్ సూపర్ హైలైట్ అని చెప్పవచ్చు. లామా 4 ఏఐ మోడల్‌తో నడిచే ఈ ఫీచర్‌ ద్వారా మీరు చేతులు ఉపయోగించకుండా సహజంగా మాట్లాడొచ్చు. చిత్రాలను సృష్టించడం, ఎడిట్ చేయడం కూడా వాయిస్‌తో సాధ్యం. ఫుల్-డ్యూప్లెక్స్ స్పీచ్ టెక్నాలజీతో మరింత మానవీయ అనుభూతి ఉంటుంది. కానీ ఇది ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.


డిస్కవర్ ఫీడ్‌తో సోషల్ టచ్

ఈ యాప్‌లో డిస్కవర్ ఫీడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇక్కడ యూజర్లు తమ ఏఐ ప్రాంప్ట్‌లు, చిత్రాలు, చాట్‌బాట్ రిప్లైలను షేర్ చేయొచ్చు. ఇతరులు వాటిని లైక్ చేయొచ్చు, కామెంట్ లేదా రీమిక్స్ చేయొచ్చు.

స్మార్ట్ గ్లాసెస్‌తో ఇంటిగ్రేషన్

మెటా రే బాన్ స్మార్ట్ గ్లాసెస్‌తో కూడా ఈ యాప్ లింక్ అవుతుంది. గ్లాసెస్‌లో స్టార్ట్ చేసిన సంభాషణలను యాప్ లేదా వెబ్‌సైట్‌లో కొనసాగించొచ్చు. ఇమేజ్ ఎడిటింగ్, గ్యాలరీ యాక్సెస్ వంటివి కూడా ఈ యాప్‌లో ఉన్నాయి.


పూర్తిగా ఉచితం

ఈ యాప్ పూర్తిగా ఫ్రీ. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేదు. భారత్‌లో యూజర్లు ఇప్పుడే దీన్ని డౌన్‌లోడ్ చేసి టెక్స్ట్ ఆధారిత ఏఐ ఫీచర్లను ట్రై చేసుకోవచ్చు. ఈ క్రమంలో చాట్ జీపీటీకి మెటా ఏఐ యాప్ గట్టి పోటీగా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో వాయిస్, సోషల్ ఫీడ్, స్మార్ట్ గ్లాసెస్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

RRBs: ఈ 15 బ్యాంకులు మే 1 నుంచి బంద్.. మీ డబ్బు భద్రమేనా..

Central Government: జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 30 , 2025 | 05:31 PM