ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AIతో GenZ పెళ్లిళ్లు.. తాజా సర్వేలో బయటపడ్డ సంచలన విషయాలు

ABN, Publish Date - May 11 , 2025 | 01:51 PM

Generation Z: జాయ్ ఏఐ యాప్‌లో మనకు ఇష్టమైన విధంగా ఏఐ భాగస్వాములను రూపొందించుకోవచ్చు. వాటితో మనకు ఇష్టం వచ్చినట్లుగా చాట్ చేసుకోవచ్చు. ఇక, జాయ్ ఏఐ ఏప్రిల్ నెలలో 2 వేల మంది యూజర్లపై సర్వే జరిపింది.

Generation Z

నైంటీస్ కిడ్స్‌కు, జనరేషన్ జెడ్ కిడ్స్‌కు ఆలోచనల్లో ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనరేషన్ జెడ్ కిడ్స్ చాలా స్పీడుగా ఉంటారు. ఈ స్పీడు పెళ్లి విషయంలోనూ కనిపిస్తోంది. మారుతున్న కాలానికి తగ్గట్టు నైంటీస్ కిడ్స్ ఇంకా మారలేకపోతున్నారు. కానీ, జనరేషన్ జెడ్ కిడ్స్ మాత్రం అన్ని మార్పులకు ఇట్టే అలవాటు పడిపోతున్నారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌( ఏఐ)ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు. అవును మీరు విన్నది నిజమే..


జనరేషన్ జెడ్ కిడ్స్ ఏఐతో తయారైన భాగస్వామితో పెళ్లికి సిద్ధంగా ఉన్నారట. ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది. జాయ్ ఏఐ ఈ సర్వేను నిర్వహించింది. ఈ జాయ్ ఏఐ తమ యూజర్లకు శృంగారం, రొమాన్స్, డేటింగ్, ఇతర విషయాలకు సంబంధించిన సేవలు అందిస్తోంది. జాయ్ ఏఐలో మనకు ఇష్టమైన విధంగా ఏఐ భాగస్వాములను రూపొందించుకోవచ్చు. వాటితో మనకు ఇష్టం వచ్చినట్లుగా చాట్ చేసుకోవచ్చు. ఇక, జాయ్ ఏఐ ఏప్రిల్ నెలలో 2 వేల మంది యూజర్లపై సర్వే జరిపింది.


మీరు ఏఐ భాగస్వామిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా అని అడిగింది. 80 శాతం మంది యూజర్లు తాము ఏఐ భాగస్వామిని పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. అందులో 75 శాతం మంది ఏఐ మానవ సంబంధాలను రీప్లేస్ చేస్తుందని అన్నారు. అయితే, ఏఐతో బంధాలను పెట్టుకోవటం వల్ల దారుణాలు కూడా జరుగుతున్నాయి. ప్లోరిడాకు చెందిన 14 ఏళ్ల బాలుడు గేమ్ ఆఫ్ థ్రోన్ చాట్ బాట్‌తో గట్టి బంధం ఏర్పరుచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి

ICAR Chief Ayyappan: విషాదం.. కావేరీ నదిలో శవమై తేలిన ICAR మాజీ చీఫ్

Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా

Updated Date - May 11 , 2025 | 01:53 PM