ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Captcha Scam: దేశంలో కొత్తగా క్యాప్చా స్కామ్..క్లిక్‌ చేస్తే ఇక అంతే సంగతులు..

ABN, Publish Date - Aug 18 , 2025 | 11:34 AM

జనాలను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా మరో స్కామ్‎తో వచ్చేశారు. అయితే ఈసారి ఎలాంటి స్కామ్ చేస్తున్నారు. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Captcha Scam alert

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త టెక్నిక్‌తో ప్రజలను మోసం చేసేందుకు రెడీగా ఉంటున్నారు. ఇప్పటికే పలు విధాలుగా స్కామ్ల్ చేసి డబ్బులు దోచుకున్న వారు, ఇప్పుడు మరో కొత్త మోసంతో వచ్చేశారు. అసలు విషయం తెలిసి బయట పడేలోపే లక్షలు కొల్లగొడుతున్నారు. అయితే ఈ కొత్త స్కామ్ ఎలా జరుగుతోంది? ఎలాంటి మోసం చేస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

బ్యాంక్ వివరాల నుంచి..

సాధారణంగా ఆన్‌లైన్‌లో మనం రోజూ చూసే నేను రోబోట్ కాదు క్యాప్చా అనే కోడ్‌లను (Captcha Scam) చూస్తుంటాం. కానీ ఇప్పుడు వాటిని కూడా నకిలీవి తయారు చేసి, వాటి ద్వారా మన ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను పంపిస్తున్నారు. ఈ మాల్వేర్ పేరు లూమా స్టీలర్. ఇది మన బ్యాంక్ వివరాల నుంచి పాస్‌వర్డ్‌ల వరకు అన్నీ దొంగిలించగల సామర్థ్యం ఉన్న డేంజరస్ వైరస్. ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో సర్ఫ్ చేసేటప్పుడు, ముఖ్యంగా తెలియని వెబ్‌సైట్‌లు, పాప్-అప్ యాడ్స్ లేదా బ్రౌజర్ నోటిఫికేషన్స్‌ను క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

క్యాప్చా స్కామ్ అంటే ఏంటి?

మనం ఆన్‌లైన్‌లో ఏదైనా వెబ్‌సైట్‌లో లాగిన్ చేసేటప్పుడు లేదా ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు నేను రోబోట్ కాదని, టిక్ చేయమని క్యాప్చా కోడ్ వస్తుంది. ఇది సైట్‌ను బాట్‌ల నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుంది. కానీ, సైబర్ క్రిమినల్స్ ఈ సాధారణ సెక్యూరిటీ టూల్‌నే ఇప్పుడు మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు.

వీళ్లు నకిలీ క్యాప్చా కోడ్‌లను హ్యాక్ చేసిన వెబ్‌సైట్‌లలో, ఫిషింగ్ ఈమెయిల్స్‌లో లేదా మోసపూరిత యాడ్స్‌లో పెడుతున్నారు. మనం ఆ క్యాప్చాను క్లిక్ చేసిన వెంటనే, మన సిస్టమ్‌లో మాల్వేర్ సైలెంట్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, లాగిన్ డీటెయిల్స్, బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ దొంగిలించబడతాయి.

మాల్వేర్ గురించి

ఈ నకిలీ క్యాప్చాల ద్వారా వ్యాప్తి చేస్తున్న లూమా స్టీలర్ మాల్వేర్ చాలా ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన డివైస్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, బ్రౌజర్ హిస్టరీ, స్టోర్డ్ డేటా... అన్నింటినీ యాక్సెస్ చేస్తుంది. ముఖ్యంగా, బ్రౌజర్ నోటిఫికేషన్స్‌ను ఎనేబుల్ చేయమని అడిగే ప్రామ్ట్‌లను క్లిక్ చేస్తే, హ్యాకర్లకు మన సిస్టమ్‌పై మరింత యాక్సెస్ లభిస్తుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది?

సైబర్ క్రిమినల్స్ పాపులర్ వెబ్‌సైట్‌ల మాదిరిగా కనిపించే డమ్మీ సైట్‌లను తయారు చేస్తారు. ఆ సైట్‌లలో నకిలీ క్యాప్చా ప్రామ్ట్‌లు చూపిస్తారు. మనం ఆ క్యాప్చాను క్లిక్ చేసిన తర్వాత, నోటిఫికేషన్స్‌ను అనుమతించమని లేదా ఏదో ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయమని అడుగుతారు. క్యాప్చాను క్లిక్ చేయడం వల్ల వెంటనే ఏమీ కాకపోవచ్చు, కానీ ఆ తర్వాత వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో చేస్తే మన డివైస్‌లోకి మాల్వేర్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 12:16 PM