World Test Championship: 2031 వరకు లండన్‌లోనే
ABN, Publish Date - Jul 21 , 2025 | 03:14 AM
ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2031 వరకు ఇంగ్లండ్‌లోనే జరుగుతుందని ఐసీసీ తేల్చింది. ఆదివారం సింగపూర్‌లో జరిగిన ఐసీసీ ఏజీఎంలో ఈమేరకు...
డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఐసీసీ
సింగపూర్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2031 వరకు ఇంగ్లండ్‌లోనే జరుగుతుందని ఐసీసీ తేల్చింది. ఆదివారం సింగపూర్‌లో జరిగిన ఐసీసీ ఏజీఎంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2019లో ఆరంభమైన డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు మూడు ఫైనల్స్‌కు ఇంగ్లండే ఆతిథ్యమిచ్చింది. అయితే వచ్చేసారి భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. ఇప్పటికిదాకా ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహణ తీరుపై సంతృప్తి చెందడంతో 2027, 2029, 2031 డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆతిథ్య హక్కులను ఇచ్చినట్టు ఐసీసీ పేర్కొంది. మరోవైపు టిమోర్-లెస్టే క్రికెట్ సమాఖ్య, జాంబియా క్రికెట్ యూనియన్లను అసోసియేట్ సభ్య దేశాలుగా చేర్చుకుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 21 , 2025 | 03:14 AM