Share News

Andre Russell retirement: క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:32 AM

వెస్టిండీస్‌ పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌(37) తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈ నెల 22న సొంత మైదానం సబీనా పార్క్‌లో ఆస్ట్రేలియాతో రెండో టీ20...

Andre Russell retirement: క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

22న ఆసీ్‌సతో ఆఖరి టీ20

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌ పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌(37) తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈ నెల 22న సొంత మైదానం సబీనా పార్క్‌లో ఆస్ట్రేలియాతో రెండో టీ20.. రస్సెల్‌ కెరీర్‌కు చివరిది కానుంది. పొట్టి క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న రస్సెల్‌ 2012, 2016 టీ20 వరల్డ్‌క్‌పలు నెగ్గిన వెస్టిండీస్‌ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. 2019 నుంచి రస్సెల్‌ కేవలం టీ20ల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఫ్రీలాన్సర్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. 84 టీ20లు, 56 వన్డేలు, ఒక్క టెస్ట్‌లో విండీ్‌సకు ప్రాతినిథ్యం వహించాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీ్‌సకు రస్సెల్‌ ఎంపియ్యాడు. కానీ, ఈ నెల 20, 22న జరిగే తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని నిర్ణయించుకొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..

ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..

Updated Date - Jul 18 , 2025 | 05:32 AM