Mohammad Rizwan Out: రిజ్వాన్.. ఇదెక్కడి బ్యాటింగ్.. ఎలా అవుటయ్యాడో చూడండి..
ABN, Publish Date - Aug 14 , 2025 | 05:36 PM
దాదాపు 34 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను గెలుపొంది వెస్టిండీస్ టీమ్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ టీమ్ 2-1 తేడాతో పాకిస్థాన్ జట్టుపై గెలుపొందింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది.
దాదాపు 34 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను గెలుపొంది వెస్టిండీస్ టీమ్ చరిత్ర సృష్టించింది (Pak vs WI). వెస్టిండీస్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ టీమ్ 2-1 తేడాతో పాకిస్థాన్ జట్టుపై గెలుపొందింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 295 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయి 200 పైచిలుకు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) బ్యాటింగ్ తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. రెండో మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే ఔటైన రిజ్వాన్ మూడో మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ అవుటైన విధానం మాత్రం చాలా మందికి ఆగ్రహం కలిగిస్తోంది. ఆఫ్ స్టంప్‌నకు కొద్దిగా అవతల వేసిన బంతిని ఆడకుండా వదిలేయడంతో అది కొద్దిగా స్వింగ్ అయి వికెట్లను గిరాటేసింది. చాలా సులభంగా ఆడాల్సిన బంతిని ఆడకూడదని రిజ్వాన్ భావించడం చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది (Mohammad Rizwan Out).
ఈ సంవత్సరంలోనే ఇది చెత్త అవుట్ అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఆ బంతి ఇన్‌స్వింగర్ అని బౌలర్ కూడా అర్థం చేసుకొని ఆడతాడని కొందరు కామెంట్లు చేశారు. రిజ్వాన్ బ్యాటింగ్ చాలా దారుణంగా ఉందని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజ్వాన్ చాలా చీప్‌గా అవుటయ్యాడని మరొకొందరు విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా?
పాక్ జట్టు నిండా స్వార్థపరులే.. గెలవాలనే కోరిక లేదు.. షోయెబ్ అక్తర్ ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 14 , 2025 | 05:36 PM