Gukesh Dommaraju: ఆ పని మాత్రం చేయొద్దు.. గుకేశ్‌కు విశ్వనాథన్ ఆనంద్ వార్నింగ్!
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:11 PM
వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చెలరేగిపోతున్నాడు. వరుస విజయాలతో చెస్‌లో తనదైన మార్క్ సృష్టిస్తున్నాడు. అలాంటోడికి ఆ పని మాత్రం చేయొద్దంటూ కీలకమైన సలహా ఇచ్చాడు దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.
దొమ్మరాజు గుకేశ్.. చెస్‌లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు. కేవలం ఆరేడు నెలల వ్యవధిలోనే చెస్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడీ కుర్రాడు. 18 ఏళ్ల వయసులోనే చైనా డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి నయా వరల్డ్ చాంపియన్‌గా అవతరించాడు గుకేశ్. ఇటీవల అతడు మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నార్వే చెస్ టోర్నమెంట్-2025లో చెస్ రారాజు మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ చెస్‌లో ఆరో రౌండ్‌లో మట్టికరిపించాడు భారత గ్రాండ్ మాస్టర్. తెల్ల పావులతో ఆడిన గుకేశ్.. కార్ల్‌సన్ చేసిన చిన్న తప్పిదాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన వ్యూహాలతో విక్టరీ సాధించాడు. దీంతో అంతా అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మాత్రం గుకేశ్ మీద సీరియస్ అయ్యాడు. అతడి డిఫెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విషీ. ఇంతకీ అతడేం అన్నాడంటే..
ప్రతిసారీ ఒకే వ్యూహమా?
ప్రత్యర్థి ఆటగాడు తప్పు చేసేవరకు వేచిచూసి.. చివర్లో ఆటను మలుపు తిప్పడంలో గుకేశ్‌ది ప్రత్యేక నైపుణ్యం అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు విశ్వనాథన్ ఆనంద్. అతడు మంచి డిఫెన్స్ ప్లేయర్ అని చెప్పాడు. మ్యాచ్ పోతుందునే స్థితిలోనూ, ఓటమి ఖరారు అయ్యాక కూడా అతడు ఓపిగ్గా ఆడతాడని విషీ తెలిపాడు. అలా ఆడటం అంత సులువు కాదన్నాడు. ప్రత్యర్థి అలసిపోయి తప్పు చేసినప్పుడు ఆ చాన్స్‌ను వినియోగించుకొని మ్యాచ్‌ను గుకేశ్ మలుపు తిప్పుతాడని పేర్కొన్నాడు. కార్ల్‌సన్‌తో మ్యాచ్‌లోనూ ఇలాగే చేసి గెలుపొందాడని.. అయితే ఇది సరైన వ్యూహం కాదన్నాడు విశ్వనాథన్ ఆనంద్. ప్రతిసారి డిఫెన్స్ అప్రోచ్‌తో ముందుకెళ్లడం కరెక్ట్ కాదని హెచ్చరించాడు. గుకేశ్ మంచి ఫైటర్ అని.. అయితే అన్నిసార్లూ ఒకేలా ఆడుతుంటే మాత్రం తనకు నచ్చదన్నాడు ఆనంద్. మరి.. ఈ సలహాను గుకేశ్ ఎంతవరకు పాటిస్తాడో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 07 , 2025 | 01:11 PM