Patna Airport: ప్రధానితో వైభవ్ కుటుంబం
ABN, Publish Date - May 31 , 2025 | 03:06 AM
ప్రధాని నరేంద్ర మోదీ, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని పట్నా విమానాశ్రయంలో కలిశారు. 14 ఏళ్ల వైభవ్, ప్రధాని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు.
పట్నా: ప్రధాని నరేంద్ర మోదీని యువ సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కలిశాడు. ఈ సందర్భంగా స్థానిక విమానాశ్రయంలో వైభవ్, అతడి తల్లిదండ్రులను మోదీ ఆప్యాయంగా పలకరించారు. 14 ఏళ్ల వైభవ్ ప్రధాని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ‘యువ క్రికెటర్ వైభవ్, అతడి కుటుంబాన్ని పట్నా ఎయిర్‌పోర్టులో కలిశాను. అతడి భవిష్యత్తు గొప్పగా సాగాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐపీఎల్‌లో సెంచరీ చేశాక ప్రధాని తన ’మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ వైభవ్‌ను కొనియాడారు.
Updated Date - May 31 , 2025 | 03:07 AM