ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Badminton World Championships 2025: భారత షట్లర్లకు కఠిన డ్రా

ABN, Publish Date - Aug 14 , 2025 | 01:57 AM

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత షట్లర్లకు కఠిన సవాళ్లు ఎదురు కానున్నాయి. ఈ నెల 25 నుంచి 31 వరకు జరిగే మెగా టోర్నీ డ్రాను బుధవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌కు తొలి రౌండ్‌లోనే...

పేలవ ఫామ్‌లో సింధు, లక్ష్య సేన్‌

వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స

పారిస్‌: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత షట్లర్లకు కఠిన సవాళ్లు ఎదురు కానున్నాయి. ఈ నెల 25 నుంచి 31 వరకు జరిగే మెగా టోర్నీ డ్రాను బుధవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌కు తొలి రౌండ్‌లోనే వరల్డ్‌ నెం:1 షి యు కి (చైనా) రూపంలో గండం ఎదురుకానుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీ్‌సలో ఓటమి తర్వాత లక్ష్య సేన్‌ మళ్లీ పుంజుకోలేకపోయాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సేన్‌ కాంస్యం సాధించాడు. మరో భారత షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ కూడా ఫామ్‌లో లేడు. తొలి రౌండ్‌ గట్టెక్కినా.. రెండో రౌండ్‌లో వరల్డ్‌ నెం:2 ఆండ్రెస్‌ అంటాన్‌సెన్‌ రూపంలో ముప్పు పొంచి ఉంది. కాగా, 2019 చాంపియన్‌ పీవీ సింధు మాత్రమే మహిళల సింగిల్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. తొలి రౌండ్‌లో కలోయనా నల్‌బంటోవా (బల్గేరియా)తో సింధు తలపడనుంది. ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న సింధు.. ప్రీక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ వాంగ్‌ జి యి (చైనా)ను ఢీకొనాల్సి రావచ్చు. ఈ టోర్నీలో సింధు స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది. ఈ ఏడాది ఇండియా ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరడమే సింధు అత్యుత్తమ ప్రదర్శన. కాగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంటకు తొలి రౌండ్‌ బై లభించింది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి జోడీ టోర్నీ నుంచి తప్పుకోగా.. రితుపర్ణ-శ్వేతపర్ణ, ప్రియ కొన్‌జెంగ్‌బమ్‌-శ్రుతి మిశ్రా జంటలు బరిలో నిలవనున్నాయి. మిక్స్‌డ్‌లో రుత్విక గద్దె-రోహన్‌ కపూర్‌, ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో ద్వయాలు ఆడనున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 01:57 AM