Share News

CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:31 PM

స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలు... అందుకు సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు.

CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
AP CM Chandrababu

అమరావతి, ఆగస్ట్ 12: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మరో పథకం అమలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ‘స్త్రీ శక్తి’ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాజధాని అమరావతిలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం అమలు కానున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రద్దీ నిర్వహణ, మర్యాదపూర్వక ప్రవర్తన, భద్రత ముఖ్యమని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా.. ఆటో డ్రైవర్లకు సాయంపై సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.


2024, మే, జూన్ మాసాల్లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి పార్టీకి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన పలు హామీలను ఈ కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేసింది. తాజాగా అంటే.. ఆగస్ట్ 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించనుంది. ఈ పథకానికి స్త్రీ శక్తి పేరు పెట్టారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించనున్నారు. జిల్లాలో మంత్రులు ప్రారంభించనున్నారు.


మరోవైపు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణల్లో ఈ మహిళ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నార. ఈ పథకం వల్ల మహిళలు భారీగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. జీరో టికెట్‌తో వారంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నారు. అందువల్ల తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 2 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తోంది. దాదాపుగా కర్ణాటకలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.


ఈ పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేసింది. అందులో భాగంగా ఈ పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణాల్లో ఏపీ అధికారులు, మంత్రుల బృందం పర్యటించింది. అందుకు సంబంధించిన వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ క్రమంలో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పథకం గతంలోనే ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ పథకం వాయిదా పడుతూ వస్తోంది. చివరకు ఈ ఏడాది 15వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పరిశ్రమ ఏర్పాటు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

మళ్లీ కాళ్ల బేరానికి దిగిన పాక్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 04:45 PM