Central Cabinet Meeting: ఏపీలో పరిశ్రమ ఏర్పాటు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 12 , 2025 | 03:44 PM
న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ యూనిట్లను ఒడిశా, పంజాబ్‌లో సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం మొత్తం రూ.4,600 కోట్ల నిధులను కేటాయించింది. మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో మెట్రో రైలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా లక్నో మెట్రో ఫేజ్ 1బి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ దశలో రూ. 5,801 కోట్ల వ్యయంతో 11.65 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌లో 700 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద రూ. 8,146 కోట్లు కేటాయించాలని భావించింది. దీనిని 72 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధిస్తూ కేబినెట్ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
మళ్లీ కాళ్ల బేరానికి దిగిన పాక్
జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్
For More National News and Telugu News