ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ind vs Eng: చరిత్ర సృష్టించిన టీమిండియా.. నమోదైన సూపర్ రికార్డులు ఇవే..

ABN, Publish Date - Jul 07 , 2025 | 07:24 AM

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా, పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

Shubman Gill

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది (Ind vs Eng). అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌‌లోనూ రాణించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 430 పరుగులు చేశాడు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ వెన్ను విరిచారు. దీంతో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది (TeamIndia Records).

ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా, పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

  • ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్ (430) నిలిచాడు

  • ఒక టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 150కి పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గిల్.

  • ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది.

  • విదేశీ గడ్డపై చిన్న వయసులో తొలి టెస్ట్ విజయం అందుకున్న కెప్టెన్‌గా గిల్.

  • SENA దేశాల్లో 30 టెస్ట్ విజయాలు సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా.

  • ఇంగ్లండ్‌లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆకాష్ దీప్. ఇంతకు ముందు చేతన్ శర్మ (1986 ఎడ్జ్‌బాస్టన్‌లోనే) ఈ ఘనత సాధించాడు.

  • ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు (1692) ఈ మ్యాచ్‌లోనే.

  • ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (30) నమోదవడం ఇదే మొదటిసారి.

ఇవీ చదవండి:

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్

పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 09:22 AM