Jyothi Surekha: మిక్స్‌డ్ కాంస్య పోరుకు సురేఖ జోడీ
ABN, Publish Date - Jul 12 , 2025 | 02:55 AM
తెలుగు స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ కప్ స్టేజ్-4 పోటీల్లో మరో రెండు పతకాలకు చేరువైంది...
వ్యక్తిగత ఈవెంట్‌లో సెమీ్‌సకు తెలుగు ఆర్చర్
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4
మాడ్రిడ్: తెలుగు స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ కప్ స్టేజ్-4 పోటీల్లో మరో రెండు పతకాలకు చేరువైంది. ఇప్పటికే సహచరులతో కలిసి కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన సురేఖ.. తాజాగా వ్యక్తిగత విభాగంలో సెమీఫైనల్‌కు, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం పోరుకు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సురేఖ 147-144తో హజల్ బురున్ (తుర్కియే)ని ఓడించి సెమీస్ చేరింది. ఇదే కేటగిరిలో మరో భారత అమ్మాయి పర్ణీత్ కౌర్ 142-141తో ఓజ్నర్ (తుర్కియే)పై గెలిచి సెమీ్‌సలో ప్రవేశించింది. ఇక కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో భారత ద్వయం, టాప్‌సీడ్ సురేఖ/రిషభ్ యాదవ్ 152-155తో నెదర్లాండ్స్ జంట చేతిలో ఓటమిపాలైంది. దీంతో శనివారం జరిగే కాంస్య పతక పోరులో ఎల్ సాల్వడార్ జంటతో సురేఖ జోడీ తలపడనుంది. కాగా, రికర్వ్ విభాగం మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ధీరజ్ బొమ్మదేవర/అంకిత ద్వయం 1-5తో స్విట్జర్లాండ్ జంట చేతిలో ఓడి ఆరంభ రౌండ్లోనే వెనుదిరిగింది.
Updated Date - Jul 12 , 2025 | 02:55 AM