ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

WTC: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. విజయం సంబరాలను ఓ సారి చూడండి..

ABN, Publish Date - Jun 14 , 2025 | 07:49 PM

ఐసీసీ ఈవెంట్లు అంటే దక్షిణాఫ్రికాకు పెద్దగా కలిసి రావు. సాధారణ సిరీస్‌ల్లో ప్రత్యర్థులను వణికించే సఫారీ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతుంటుంది. అయితే చరిత్రకు భిన్నంగా ఈసారి మెరుగైన ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.

South Afric Won ICC world test championship

ఐసీసీ (ICC) ఈవెంట్లు అంటే దక్షిణాఫ్రికాకు పెద్దగా కలిసి రావు. సాధారణ సిరీస్‌ల్లో ప్రత్యర్థులను వణికించే సఫారీ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతుంటుంది. అయితే చరిత్రకు భిన్నంగా ఈసారి మెరుగైన ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది (SA vs Aus). న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాత తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్ గెలుచుకున్న మూడో జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది (world test championship).

లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందింది. ఐదెన్ మార్‌క్రమ్ (136) అద్భుత శతకం సాధించాడు. దక్షిణాఫ్రికా తరఫున ఐసీసీ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. దాదాపు చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. విజయానికి మరో ఆరు పరుగులు కావాల్సి ఉండగా హేజిల్ వుడ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన బ్యాటర్ పని పూర్తి చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది.

ఇవి కూడా చదవండి:

అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్

ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్‌ రియాక్షన్‌‌పై గుకేశ్ స్పందన ఇదీ

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 07:49 PM