మళ్లీ అగ్రపీఠంపై మంధాన
ABN, Publish Date - Jun 18 , 2025 | 05:44 AM
ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం...
ఆరేళ్ల తర్వాత టాప్‌లోకి
దుబాయ్: ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి 727 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీ్‌సలో 52 సగటుతో 264 పరుగులు సాధించడంతో ఆమె ర్యాంక్ మెరుగుపడింది. బ్రంట్ (ఇంగ్లండ్), లారా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా) 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్), గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా), మేగాన్ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్) తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 18 , 2025 | 05:44 AM