Virat Kohli: గిల్-పంత్‌తో కోహ్లీ మీటింగ్.. టీమిండియా కోసం బిగ్ స్కెచ్!
ABN , Publish Date - Jun 17 , 2025 | 07:05 PM
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెర వెనుక నుంచి జట్టు విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నాడట. గిల్-పంత్‌తో అతడు పెట్టిన మీటింగ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది గిల్ సేన. 5 టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టును ఎలాగైనా ఓడించాలనే కసితో కనిపిస్తోంది టీమిండియా. కుర్రాళ్లతో కూడిన మెన్ ఇన్ బ్లూ.. స్టోక్స్ సేన బెండు తీయాలనే పంతంతో ఉంది. అందుకోసం నెట్స్‌లో రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఈ తరుణంలో కొత్త సారథి శుబ్‌మన్ గిల్, నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీటింగ్ పెట్టాడనే వార్త బయటకు వచ్చింది. 2 గంటల పాటు ఈ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. అసలు.. గిల్-పంత్‌ను కోహ్లీ ఎందుకు కలిశాడనేది ఇప్పుడు చూద్దాం..

గిల్-పంత్‌తో కలసి..
లండన్‌లో ఉంటున్న కోహ్లీ ఇంటికి గిల్-పంత్‌తో పాటు పలువురు భారత ఆటగాళ్లు వెళ్లారని తెలుస్తోంది. గిల్ అండ్ కో అక్కడ 2 గంటల పాటు ఉన్నారని సమాచారం. విరాట్ వీళ్లందరికీ డిన్నర్ ఏర్పాటు చేశాడని.. విందు తర్వాత శుబ్‌మన్-రిషబ్‌తో అతడు సుదీర్ఘంగా చర్చించాడని వినిపిస్తోంది. ఇండియా ఏ-ఇండియా మధ్య జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజే ఈ మీటింగ్ చోటుచేసుకుందని తెలుస్తోంది. రాబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కోవాలి, బ్యాటింగ్ యూనిట్‌ను నడిపే తీరు, సారథ్య చిట్కాలు వంటివి కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్‌కు విరాట్ సూచించాడని వినిపిస్తోంది. కాగా, గత కొన్నాళ్లుగా కోహ్లీ లండన్‌లోనే ఉంటున్నాడు. టీమిండియా సిరీస్‌ల సమయంలో బయటకు వస్తున్న విరాట్.. మ్యాచులు ముగియగానే తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు. అనుష్క శర్మ, పిల్లలతో కలసి అతడు యూకేలోనే సెటిల్ అయిపోతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి