Share News

Jasprit Bumrah: కెప్టెన్సీపై బుమ్రా సంచలన వ్యాఖ్యలు.. ఇస్తానని చెప్పినా..!

ABN , Publish Date - Jun 17 , 2025 | 06:02 PM

టీమిండియా టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంపై తొలిసారి పెదవి విప్పాడు. భారత క్రికెట్ బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందన్నాడు. మరి.. బుమ్రా ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: కెప్టెన్సీపై బుమ్రా సంచలన వ్యాఖ్యలు.. ఇస్తానని చెప్పినా..!
Jasprit Bumrah

దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌తో భారత టెస్ట్ జట్టులో గణనీయమైన మార్పులు వచ్చేశాయి. టీమ్‌లోకి కొత్త రక్తాన్ని ఎక్కించింది బీసీసీఐ. యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను నూతన సారథిగా ఎంచుకుంది. కెప్టెన్సీ రేసులో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పేరు బాగా వినిపించినా.. గిల్ వైపే మొగ్గు చూపింది బీసీసీఐ. దీంతో బుమ్రాకు అన్యాయం జరిగిందని.. గాయాలను సాకుగా చూపి అతడికి ద్రోహం చేశారనే విమర్శలు వినిపించాయి. తాజాగా ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందని.. కానీ తానే రిజెక్ట్ చేశానని చెప్పాడు. ఏస్ పేసర్ ఇంకా ఏమన్నాడంటే..


నో చెప్పేశా..

‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అవడానికి ముందే ఐపీఎల్-2025 సమయంలో నేను బీసీసీఐతో మాట్లాడా. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సమయంలో నా పనిభారం ఎలా ఉంటుందనేది చర్చించా. నాకు చికిత్స అందించిన వారితో పాటు ట్రైనర్లు, ఫిజియోలతోనూ డిస్కస్ చేశా. దీని వల్ల నా ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉండాలనే నిర్ణయానికి వచ్చా. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెప్పా. కెప్టెన్సీ చేయాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేశా. టెస్టులకు అందుబాటులో ఉంటే చాలనుకుంటున్నాని బోర్డుకు తెలియజేశా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

bumrah.jpg


టీమ్ కోసం..

సారథ్య పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ అనుకుందని, కానీ తానే వద్దని చెప్పానన్నాడు బుమ్రా. 5 టెస్టుల సిరీస్‌లో కేవలం 3 మ్యాచులు మాత్రమే ఆడగలిగినప్పుడు కెప్టెన్‌గా ఉండటం కరెక్ట్ కాదన్నాడు. జట్టు గెలుపు కంటే తనకు ఏదీ ముఖ్యం కాదన్నాడు ఏస్ పేసర్. అంతేగానీ సగం మ్యాచులకు అందుబాటులో ఉన్నా సారథ్య పగ్గాలు తీసుకోవాలనుకునే స్వార్థ మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశాడు బుమ్రా. టీమ్ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

మనసులు గెలుచుకున్న సచిన్

భార్య చేతిలో డీకే తిట్లు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 06:02 PM